
*రామగిరి ఆలయ అర్చకులు భౌతిక కాయానికి ఎమ్మెల్యే నివాళి*
పిచ్చాటూరు మండలం రామగిరి శ్రీ వాళీశ్వర ఆలయ ప్రధాన అర్చకులు మోహన్ గురుక్కల్ శనివారం శివైఖ్యం చెందారు.
సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆదివారం ఉదయం రామగిరిలోని మోహన్ గురుక్కళ్ స్వకృహానికి చేరుకొని ఆయన బౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
అతని కుమారుడు శంకర్ గురుక్కాల్ ను, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏ ఎం సి మాజీ చైర్మన్ డీ ఇలంగోవన్ రెడ్డి, ఆరణియార్ ఆయకట్టు సంఘం చైర్మన్ రవి రెడ్డి, అడవి శంకరాపురం చెరువు ఆయకట్టు చైర్మన్ పద్దురాజు తదితరులు పాల్గొన్నారు.

