
*సత్యవేడు ఆసుపత్రిలో సమస్యల తిష్ట..*
*అత్యవసర సేవలు అంతే సంగతులు…!!*
హెచ్ డి ఎస్ నిధుల వినియోగంపై ఏదీ పారదర్శకత
నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడు పెద్ద ఆసుపత్రిలో సమస్యలు తిష్ట వేసి ఉంది ఈ కారణంగా రోగులకు ప్రభుత్వ వైద్య సేవలు అంతంత మాత్రమే.. విశాలమైన పెద్దపెద్ద భవనాలు ఉన్నప్పటికీ వినియోగం అంత మాత్రమే… ఆపరేషన్లు చేసే దిక్కే లేదు… ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చేవారు… ప్రసవ వేదనతో ఇతర ప్రాంతాలకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక కొందరు సంతకం పెట్టామా… రియల్ ఎస్టేట్ వ్యాపారం… ఇతర వ్యాపారాలకు పరుగులు పెడుతున్న… పట్టించుకునే దిక్కులేదు.. ముఖ్యంగా ఇక్కడ గైనకాలజిస్ట్ లేకపోవడంతో మహిళలు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశం 15 రోజుల్లో గైనకాలజిస్ట్ పోస్టును భర్తీ చేస్తామని హామీ ఇచ్చి రెండు మాసాలు గడిచిన స్పందన లేదని రోగులు వాపోతున్నారు ఇక మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ ఆస్పత్రిలో రోగులకు సేవలు అందడం.. వారి అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది… ఇక్కడ ఉన్న స్టాఫ్ నర్స్‌లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు ఈ కారణంగా సమస్యలు ఎక్కువైంది… రోగులకు స్వచ్ఛమైన మంచినీరు దొరకదు… కరోనా విపత్కర పరిస్థితుల్లో శ్రీ సిటీ తో పాటు ఇతర పరిశ్రమల వారు ఇచ్చిన పరికరాలు, ఇతర ఫర్నిచర్లు వాడకంలో నిర్లక్ష్యం జరుగుతోందని సత్యవేడు వాసులు వాపోతున్నారు
చేతి ద్వారా బిపి చెక్ చేసే పరికరాలు కూడా అత్యవస సమయాల్లో ఇక్కడ దొరకడం లేదు… ఆక్సిజన్ ప్లాంటు, జనరేటర్ వసతి అందుబాటులో ఉన్నప్పటికీ వాడకంలో నిర్లక్ష్యం జరుగుతోంది…
పేదల కొరకు అత్యవసమయాల్లో ఉపయోగంగా ఉంటుందని శ్రీ సిటీ యాజమాన్యం అధునాతన అంబులెన్స్ వాహనాన్ని ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది ఇన్సూరెన్స్, టైర్ల మార్పిడి.. ఇతర పనులు చేయకపోవడంతో సమస్య వచ్చింది… డెంటల్ డాక్టర్ ఉన్నప్పటికీ సరైన పరికరాల కొరత ఏర్పడింది ఆసుపత్రి సలహా సంఘం నిధులతో ఇటు అంబులెన్స్ సేవలు, ఇతర వైద్య సేవలు మెరుగుపరచాల్సి ఉంది..
ఏది ఏమైనా… శుక్రవారం నూతనంగా ఏర్పటైన ఆసుపత్రి కమిటీ సలహా సంఘం పై సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక దృష్టి పెట్టి పేదలకు ప్రభుత్వ వైద్య సేవలు నిరంతరం అందే విధంగా చూడాలని సత్యవేడు నియోజకవర్గ వాసులు కోరుతున్నారు

