
*తిరుపతి జిల్లా*
➡️ *విసిబుల్ పోలీసింగ్ లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపిఎస్., గారు తిరుపతి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, జయశ్యాం ధియేటర్ రోడ్ వద్ద అకస్మిక తనిఖీలు చేపట్టారు.*
➡️ *నగరంలోని రైల్వే స్టేషన్, ఆర్టిసి బస్టాండు ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు చేసిన ఎస్పీ గారు.*
➡️ *ఆర్టీసీ బస్టాండు లో బస్సులు లోపలికి వచ్చే ప్రదేశంతో పాటు బస్సులు బయటకు వెళ్ళే ప్రదేశం ను పరిశీలించారు.*
➡️ *ఆర్టీసీ బస్టాండ్ లగేజ్ సెంటర్ తనిఖీ చేశారు.*
➡️ *లగేజి పెట్టే వారి వద్ద నుండి ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తారు.. బ్యాగులను ఎలా తనిఖీలు చేస్తారు అని అడిగి తెలుసుకున్నారు.*
➡️ *ఇతర దేశాల నుండి రాష్ట్రాల నుండి గుర్తు తెలియని వాళ్ళు వస్తూ ఉంటారని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.*
➡️ *అంతే కాకుండా ఆర్టీసీ బస్టాండులోని సిసి కెమెరాలు పనితీరును అడిగి తెలుసుకున్నారు… సిసి కెమెరాలు స్టోరేజ్ ఎన్ని రోజులు ఉంటాయని అడిగి తెలుసుకుని ఎక్కువ రోజులు ఉండే విధంగా చూసుకోవాలని అదేశించా.*
➡️ *నగరం లోని జయశాం థియేటర్ సందు లోఆటో డ్రైవర్లు తో ఎస్పీ గారు మాట్లాడారు.*
➡️ *ట్రాఫిక్ కు అంతరాయం కలిగించ కూడా ఉండాలని సూచించారు.*
➡️ *కొంతమంది ఆటో డ్రైవర్లు ఆటోలను అడ్డదిడ్డంగా డ్రైవింగ్ చేస్తారని అలాంటి వారి గుర్తించి మీరే నివారించాలని సూచించారు.*
➡️ *ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ లైసెన్స్ ఉండాలని.. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు.*
➡️ *ఇతర ప్రాంతాల నుండి తిరుపతికి తిరుమలకు వస్తున్న భక్తుల పట్ల గౌరవంగా ఉండాలని ఆదేశించారు.*
➡️ *భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన అసభ్యకరంగా వ్యవహరించిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.*
➡️ *రైల్వే స్టేషన్ లోని పరిసర ప్రాంతాలను పరిశీలించారు.*
➡️ *రైల్వే స్టేషన్ కు ఇన్ గెట్ అవుట్ గెట్ తోపాటు ఎన్ని మార్గాలు ఉన్నాయి… అనేదాని పై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.*
➡️ *రైల్వే స్టేషన్ సమీపంలో ఆకతాయాలని గుర్తించి వరకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు.*
➡️ *గంజాయి సేవించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సిబ్బందికి సూచించారు.*
➡️ *ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి రైల్వే స్టేషన్ వస్తున్న భక్తుల పట్ల అమర్యాదగా వివరించిన అసభ్యంగా ప్రవర్తించిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సిబ్బందికి ఆదేశించారు.*
➡️ *నగరంలో పోలీస్ సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ గారు*
ఈ కార్యక్రమంలో శ్రీ కె. రవిమనోహరచారి అదనపు ఎస్పీ పరిపాలన శాంతి భద్రతలు , శ్రీలత డీఎస్పీ మహిళా పిఎస్, శ్రీ రామకృష్ణ చారి డీఎస్పీ ట్రాఫిక్,తమీమ్ అహ్మద్ సిఐ మహిళా పిఎస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

