
*స్విమ్స్ ఆధ్వర్యంలో రాయపేడు, ఓలూరులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్*
స్విమ్స్ ఆధ్వర్యంలో గురువారం కెవిబి పురం పిహెచ్ సి పరిధిలోని రాయపేడు, ఓలూరులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది. బిపి, షుగరు పరీక్షలతోపాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు.
కెవిబి పురం పిహెచ్ సి పరిధిలో ఫిబ్రవరి 7న కళత్తూరు, కాట్రపల్లి, ఫిబ్రవరి 10న ఎగువపూడి, ఎంఏ రాజుల కండ్రిగ, ఫిబ్రవరి 11న ఆరై, సదాశివపురంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు జరుగనున్నాయి.
ఈ కార్యక్రమాల్లో మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ కఠారి కుమార్, డాక్టర్ వాణి, స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ హరిత, డాక్టర్ పద్మావతి, సర్పంచులు బాలాజీ, గోపాల్, ఎస్.సురేష్, పంచాయతీ కార్యదర్శులు మణికంఠ, బాలకృష్ణ, ఎంపిహెచ్ఈఓ రవిచంద్రరాజు, పిహెచ్ ఎన్ ఎస్.వెంకటమ్మ, ఎంఎల్ హెచ్ పిలు జయంతి, ప్రియ, ఏఎన్ఎంలు సుమతి, కళావతి, స్థానిక వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

