
ఆహార సరఫరాలో అవకతవకలు జరిగితే సమాచారం ఇవ్వండి..!
రేషన్, హాస్టల్స్ లో ఆహారం సరఫరాలో ఎక్కడైనా అవకతవకలు జరిగితే ప్రజలు ఫుడ్ కమిషన్ వాట్సాప్ నంబర్ 9490551117 కి వీడియోల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. బుధవారం గూడూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్ను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులను ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహశీల్దార్ చంద్రశేఖర్, సీడీపీఓ మెహబూబి ఉన్నారు.

