
*ఏపీలో ఉచిత బస్సు.. ఉగాదికి ఫిక్స్!*
అమరావతి :
ఏపీలో సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఉన్నా కూడా ఆచరణలో మాత్రం అడుగులు ముందుకు పడడం లేదు. అయితే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని కూటమి పెద్దలు గతేడాది ఎన్నికల వేళ హామీ ఇచ్చారు. మొదట దసరా.. ఆ తర్వాత సంక్రాంతి అన్నారు. ఇపుడు ఉగాదికి ఖచ్చితంగా మొదలు పెడతామని కూటమి మంత్రులు అంటున్నారు.
