Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

గంజాయి తరలిస్తూ పట్టుబడిన విలేకరులు

*గంజాయి తరలిస్తూ పట్టుబడిన విలేకరులు*

 

*-బూర్గంపాడు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తో పాటు మరో ఇరువురు అరెస్టు*

 

*-*ప్రెస్* మాటున నకిలీల దంధాలు*

 

*- చిల్లరగా మారిన చిల్లరగాళ్లతో బజారున పడుతున్న *జర్నలిజం*

 

జర్నలిజం పేరుతో పేస్ స్టిక్కర్లు తగిలించుకొని అక్రమ దందాలకు వసూళ్లకు పాల్పడుతూ జర్నలిజం వృత్తిని అపహాస్యం పాలు చేస్తున్న దుర్మార్గులు చట్టం దృష్టిలో తప్పించుకోలేరన్నదానికి నిదర్శనంగా అక్రమంగా గంజాయిని తరలిస్తూ ముఠా భద్రాద్రి జిల్లాలో పట్టుబడిన సంఘటన గురువారం వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే..

భద్రాచలంలోహైదరాబాద్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు గురువారం గోదావరి బ్రిడ్జి చెక్ పోస్ట్ దగ్గర జరిపిన వాహనతనిఖీల్లో బూర్గంపాడు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పండగ రాములు, అతని సోదరుడు పండగ వెంకటేశ్వర్లు, మరో వ్యక్తితో కలిసి కారులో తరలిస్తున్న గంజాయితో పట్టుబడ్డాడు.

భద్రాచలం ప్రాంతంలో గంజాయి రవాణా చేస్తూ, అనేకమంది అనేక సందర్భాల్లో పోలీసులకు పట్టుబడిన సంఘటనలు జరుగుతున్నాయి. పాత్రికేయులే గంజాయి తరలిస్తూ, పట్టుబడటం తీవ్ర సంచలనం సృష్టించింది. హైదరాబాద్ కు చెందిన నార్కోటిక్స్ అధికారులు స్థానిక బ్రిడ్జి చెక్ పోస్ట్ వాహనాలు తనీఖీలు చేసే సమయంలో వచ్చిన హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 ఆస్టా(నంబర్: AP37 BU 5216) కారును తనిఖీ చేశారు. ఆ కారులో ఉన్న 81.950 కిలోల ఎండు గంజాయి వారికి లభ్యమైంది. ఆ గంజాయి తరలిస్తున్న ఆకారులోని ముగ్గురు వ్యక్తులను అదుపు లోకి తీసుకుని విచారించిన నార్కోటిక్స్ అధికారులు వారి వివరాలు రాబట్టారు. వారిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సోంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి, బూర్గంపాడు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పండగ రాములు (సూర్య పత్రిక విలేకరి) పట్టుబడ్డాడు. అతని తమ్ముడు మరో విలేకరి పండగ వెంకటేశ్వర్లు (తెలంగాణ కేసరి పత్రిక), ఛత్తీస్ గఢ్ రాష్ట్రం, సుక్మా జిల్లా, కుంట తాలూకా మర్లగూడ గ్రామానికి చెందిన మడవినంద కూడా పట్టుబడ్డారు. కారు, గంజాయి తో సహా స్వాధీనం చేసుకున్న అధికారులు వాటితోపాటు నిందితులను భద్రాచలం టౌన్ పోలీసులకు అప్పగించి వివరాలు వెల్లడించారు.

*ఉమ్మడి జిల్లాలో *ప్రెస్* పై *పోలీసులు దృష్టి సారించాలి*

 

అక్షర పరిజ్ఞానం సామాజిక అవగాహన కనీస విద్యార్హతలు లేని అనేకమంది జర్నలిజo ముసుగు తొడుక్కొని చేస్తున్న ఆగడాలు చీకటి మాటు దందాలు అనేకం. సమాజంలో జర్నలిజం వృత్తిగా జీవిస్తున్న వారికి మచ్చ తీసుకొచ్చే విధంగా కొనసాగుతున్న ఈ కార్యకలాపాలపై గతంలో పోలీస్ శాఖ డేగ కన్ను వేసినా కంచె చేను వేసిందన్న చందంగా ఆ శాఖలో ఉన్న కిందిస్థాయి ఉద్యోగులే ఈ నకిలీరాయులకు కాసులకు కక్కుర్తి పడి సహకరిస్తుండడంతో చాప కింద నీరులా జిల్లాలో ఈ జర్నలిస్ట్ ప్రెస్ అనే స్టిక్కర్లు ద్విచక్ర వాహనంతో పాటు బీఎండబ్ల్యూ కార్లకు కనిపిస్తుండడం పరిస్థితికి అద్దం పడుతుంది. జిల్లాలో అప్పుడప్పుడు వెలుగు చూస్తున్న విలేకరులు ముసుగులో ఆగడాలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు ప్రతి పీఎస్ పరిధిలో జర్నలిస్టుల ముసుగులో ప్రెస్టీకర్లు తగిలించుకొని అక్రమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Related posts

నూతన సంవత్సరం వేడుకల పేరుతో మద్యం తాగి అల్లర్లు చేస్తే జైలుకే పరిమితం… ఎస్ఆర్ పురం ఎస్సై సుమన్ 

Garuda Telugu News

షిఫ్ట్ ఆపరేటర్ సాంబయ్య కుటుంబానికి ఎమ్మెల్యే ఆదిమూలం పరామర్శ

Garuda Telugu News

రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భేటీ

Garuda Telugu News

Leave a Comment