
*ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష నెరవేరింది – ఎంపీ శ్రీభరత్*
*ఇది కూటమి ప్రభుత్వం మరో విజయం – ఎంపీ శ్రీభరత్*
*విశాఖ రైల్వే అభివృద్ధికి చారిత్రాత్మక ముందడుగు – ఎంపీ శ్రీభరత్*
*విశాఖపట్నం రైల్వే అభివృద్ధికి సరికొత్త దిశ రానుంది – ఎంపీ శ్రీభరత్*
కేంద్ర ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో వాల్తేరు రైల్వే డివిజన్‌ను కొనసాగిస్తూ, విశాఖపట్నం డివిజన్‌గా పునర్విభజన చేయాలని రైల్వే బోర్డు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షను సాకారం చేయడమే కాకుండా, రైల్వే ఉద్యోగుల్లో నెలకొన్న అనిశ్చితిని కూడా తొలగించింది.
**విశాఖ రైల్వే అభివృద్ధికి చారిత్రాత్మక ముందడుగు**
132 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌ను కొనసాగిస్తూ, దానిని “విశాఖపట్నం డివిజన్” గా పునర్నామకరణం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం అని విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ గారు పేర్కొన్నారు. విశాఖ ప్రజల ఆకాంక్షలకు గౌరవం తెలిపే ఈ చారిత్రాత్మక నిర్ణయం నగర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుంది.
*దక్షిణ కోస్తా రైల్వే జోన్ – నాలుగు ప్రధాన డివిజన్లు*
విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయనున్నాయి. వీటిలో:
✅ విశాఖపట్నం డివిజన్
✅ విజయవాడ డివిజన్
✅ గుంటూరు డివిజన్
✅ గుంతకల్ డివిజన్
ఈ నాలుగు డివిజన్లతో విశాఖపట్నం రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం అవ్వడంతో పాటు, మెరుగైన మౌలిక వసతులు, సులభతర రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయి అని ఎంపీ శ్రీభరత్ గారు వివరించారు.
*విశాఖపట్నం రైల్వే అభివృద్ధికి కొత్త దిశ*
విశాఖపట్నం డివిజన్ ఏర్పాటుతో రైల్వే మౌలిక వసతులు మరింత అభివృద్ధి చెందనున్నాయి. కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మరింత మద్దతు లభించే అవకాశం ఉండడంతో విశాఖపట్నం దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు హబ్‌గా మారనుంది.
రైల్వే ప్రాజెక్టుల వేగవంతమైన అమలు, కొత్త రైళ్ల ప్రవేశం, ఆధునికీకరణ ప్రణాళికలు, మెరుగైన ప్రయాణ అనుభవానికి ఇదొక కీలక పరిణామం అని ఎంపీ శ్రీభరత్ గారు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి మరియు సిఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు..
*ఎంపీ.శ్రీభరత్ గారి కార్యాలయం*
