
గౌరవ ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు నియోజకవర్గంలో పర్యటన
గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు బుధవారం సత్యవేడు నియోజకవర్గంలోని మండలాలలో పర్యటించనున్నారు.
సత్యవేడు నియోజకవర్గంలో పర్యటించే శ్రీయుత జిల్లా కలెక్టర్ గారిని ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు బుధవారం ఉదయం 9.00 గంటలకు నారాయణవనం బైపాస్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద స్వాగతించనున్నారు.
9.45 గంటలకు పాలమంగళం జడ్పీ హైస్కూల్ కు నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం, అనంతరం ఎస్టీ కాలనీ నుండి ఎస్.సి సంక్షేమ హాస్టల్ వరకు సిమెంటు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే, కలెక్టర్ గార్లు భూమి పూజ చేయనున్నారు.
10.30 గంటలకు పిచ్చాటూరు బైపాస్ కూడలి వద్ద చేరుకొని ఆరణియార్ పర్యాటక అభివృద్ధి పనులను పరిశీలిస్తారు, తదుపరి స్థానిక ఎస్సీ కాలనీకి నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం, అనంతరం ఆరణియార్ గేట్ల వద్దకు వారు చేరుకొని 10 లక్షల చేప పిల్లలను జలాశయంలో వదలనున్నారు, తదుపరి పిచ్చాటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శిస్తారు.
మధ్యాహ్నం 1.00 గంటకు నాగలాపురం మండలంలోని వర్షాలకు దెబ్బతిన్న ద్వారకా నగర్ కాజ్ వేను గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కలెక్టర్ గారు సందర్శించనున్నారు.
2.00 గంటలకు సత్యవేడులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సందర్శన.
3.00 గంటలకు వరదయ్యపాలెం మండలం చిన్నపాండూరు ప్రభుత్వ ఆసుపత్రిని గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు సందర్శిస్తారు.
3.30 గంటలకు వరదయ్యపాలెం మండలం లోని కంచరపాలెం ఎస్టీ కాలనీని వారు సందర్శిచి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటారు.
సాయంత్రం 4.00 గంటలకు వరదయ్యపాలెం తహశీల్దారు కార్యాలయంలో 500 మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పై చర్చ.
పై కార్యక్రమాల్లో ఆయా మండలాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరడమైనది.
*మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం*
———————————–
*-ఎమ్మెల్యే గారి కార్యాలయం సత్యవేడు*
———————————–
