Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

వేలూరు గంగమ్మ ఆలయ మహా కుంభాభిషేకంలో ఎమ్మెల్యే ఆదిమూలం

వేలూరు గంగమ్మ ఆలయ మహా కుంభాభిషేకంలో ఎమ్మెల్యే ఆదిమూలం

పిచ్చటూరు మండలం వేలూరులో నూతనంగా నిర్మించిన శ్రీ గంగమ్మ తల్లి ఆలయ కుంభాభిషేక పూజల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సోమవారం ఉదయం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే గారికి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు, గ్రామ పెద్దలు ఆలయ మర్యాదలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసి మాజీ చైర్మన్ డీ ఇళంగోవన్ రెడ్డి, జడ్పిటిసి మాజీ సభ్యులు సుమాంజలి, తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటరత్నం నాయుడు, జయచంద్ర నాయుడు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Related posts

సత్యవేడు బీజేపీ నాయకుల సంభరాలు..

Garuda Telugu News

శేష వాహనం పై విహరించిన శ్రీరామచంద్రమూర్తి…

Garuda Telugu News

ఉద్రేకంగా ప్రవహిస్తుంది ఈ ప్రాంతంలో బ్రిడ్జి లేని కారణంగా కాజు వేవ్ మీదుగా ప్రవాహం ఉద్రికంగా ప్రవహిస్తుంది

Garuda Telugu News

Leave a Comment