
*తిరుపతి జిల్లా*
*తిరుమల శ్రీవారి రథసప్తమి కి భద్రతా పరమైన ఏర్పాట్లు పూర్తి.*
*జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్. గారుతో పాటు ఈవో గారు శ్రీ సి జే. శ్యామలరావు, ఐఏఎస్ గారు, జె ఈ ఓ శ్రీ వెంకయ్య చౌదరి ఐఏఎస్ గారు, మరియు శ్రీ మణికంఠ చందోలు ఐపీస్ CV&SO మాఢ వీధులలో తిరుగుతూ పరిశీలించారు.*
*నాలుగు మాడ వీధుల్లో సిబ్బంది తో గ్యాలరీస్ పూర్తి స్ధాయిలో పరిశీలించిన ఎస్పీ గారు.*
*నాలుగు మాడవీధుల్లో ఉన్నటువంటి అధికారులకు మరియు సిబ్బంది కూడా సూచనలు ఇచ్చారు.*
*బందోబస్తు విధులకు వచ్చిన పోలీసులకు తిరుమలలో విధులు, పాటించవలసిన నియమ నిబంధనలపై సిబ్బందికి పలు సూచనలు చేసిన ఎస్పీ.*
*భక్తుల భద్రతే పోలీసుల ప్రధాన కర్తవ్యం.. పోలీసులు భక్తి భావంతో విధులు నిర్వహిస్తూ, భక్తులతో మర్యాదపూర్వకంగా, సహనంగా మెలగాలి.*
*తిరుమల కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ.*
*ఒకే రోజు 7 వాహనాలలో తిరుమల మాడ వీధుల్లో ఊరేగి, భక్తులకు దర్శనమిస్తూ, కటాక్షించనున్న శ్రీవారు.*
*నిర్దేశిత పార్కింగ్ ఏరియాలలోనే భక్తులు తమ వాహనాలను పార్కింగ్ చేయాలని విజ్ఞప్తి.*
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు… ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు బందోబస్తు విధులకు హాజరైన సిబ్బందికి జిల్లా శ్రీ వి హర్షవర్ధన్ రావు ఐపిఎస్., గారు తిరుమల ఎస్.వి హై స్కూల్ గ్రౌండ్ నందు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు ఐపిఎస్., గారు మాట్లాడుతూ శ్రీవారి రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్న నేపథ్యంలో శ్రీ సుమారు 2 లక్షలు పైగా భక్తులు హాజరవుతారు. తదనుగుణంగా సుమారు 1400 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
ఉదయం 5:30am గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యే ఈ మహత్తరమైన వేడుకలలో గరుడ వాహనం మరియు చక్ర స్నానానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కావున దానికి అనుగుణంగా బందోబస్తు పోలీసు అధికారులు, సిబ్బంది సిద్దంగా ఉండాలన్నారు. పోలీసులు భక్తులతో గౌరవంగా, మర్యాదపూర్వకంగా మెలగి రథసప్తమి రోజున ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకొనే విధంగా చర్యలు చేపట్టామన్నారు.
చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు పిల్లలకు తప్పనిసరిగా వారి తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నెంబర్లను తెలియజేసే Geo-Tagging ను అమలు చేస్తున్నాము. దయచేసి పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు సహకరించి, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని భక్తులను కోరారు.
తిరుమల లో అన్ని పార్కింగ్ ప్రాంతాలు నిండిపోతే తిరుపతి లోనే పార్కింగ్ చేసే విధంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ గారు భక్తులకు తెలియజేశారు.
అదేవిధంగా ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పోలీసులకు సహకరించాలని, పోలీసులే చొరవ తీసుకొని అన్ని శాఖల యంత్రాంగాన్ని సమన్వయపరచుకుంటూ రథసప్తమి వేడుకలను విజయవంతం చేయాలని దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్పీ శ్రీ బి.హేమంత్, ఐ.పి.ఎస్. గారు, అదనపు ఎస్పీలు శ్రీ జె.వెంకట్రావు పరిపాలన, శ్రీ ఐ. రామకృష్ణ , తిరుమల, శ్రీనివాస రావు సాయుధదళ, డిఎస్పి శ్రీ విజయ శేఖర్ తితిదే విజిఓ, శ్రీ ఎన్టీవీ రాంకుమార్ మరియుశ్రీ. సురేంద్ర, సిఐలు, విజయకుమార్, ఎస్ఐలు మరియు బందోబస్తు సిబ్బంది పాల్గొన్నారు.
