
తిరుపతి.
ఇరువురు దారిదోపిడి దొంగలు అరెస్ట్.
24 గ్రాముల బంగారపు చైను, దోపిడీకి పాల్పడిన 2 ఆటోలు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం.
గత నెల 12న అలిపిరి- చెర్లోపల్లి మార్గంలోని సైన్స్ సెంటర్ సమీపంలో దారిదోపిడి జరిగిన విషయం తెలిసిందే.
తమిళనాడు రాష్ట్రం, వేలూరు కు చెందిన బాధితుడు సురేష్ బాబు వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు.
తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడిషనల్ ఎస్పీ రవి మనోహర చారి, డి.ఎస్.పి శ్రీలత ఆదేశాలతో.. కేసులో పురోగతి సాధించి, నిందితులను అరెస్టు చేసిన వెస్ట్ పోలీసులు.
A1 .చిత్తూరు జిల్లా, పలమనేరు మండలం, జంగాలపల్లి కి చెందిన నిందితుడు శివాజీ దామినేడు ప్రాంతంలో నివాసం ,
A2.చిత్తూరు జిల్లా, పలమనేరు మండలం, జంగాలపల్లి కి చెందిన కిరణ్ చెన్నారెడ్డి కాలనీలో ప్రస్తుత నివాసం.
ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్ పంపిన వెస్ట్ సీఐ మురళీమోహన్.
