Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నగరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు మృతి…

*నగరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు మృతి…*

నగరి మున్సిపాలిటీ పరిధిలోని టూరిజం రెస్టారెంట్‌ సమీపం జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

నగరి నుంచి తిరుపతికి వెళుతున్న ప్రైవేటు బస్సును గుర్తు తెలియని భారీ వాహనం పక్కనుండి ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో ప్రమాదంలో వడమాలపేట సీతారామాపురం గ్రామానికి చెందిన పార్థసారధి నాయుడు (62), రాజేంద్రనాయుడు (60), తిరుపతికి చెందిన దినేష్‌ (8), తిరుత్తణికి చెందిన కుమార్‌ (60) మృతిచెందారు.

తమిళనాడు తిరువళ్లూరుకు చెందిన చెన్నమలై (55) పరిస్థితి విషమంగా ఉండగా, తిరుపతికి చెందిన సుబ్బరత్నమ్మ (42), భరత్‌ (40). తిరువళ్లూరుకు చెందిన సుధాకర్‌ (50) అనే వారికి తీవ్రగాయాలైంది.

తిరుపతికి చెందిన రాధాకృష్ణ, శెల్వి, నాగేంద్ర, ఊత్తుకోటకు చెందిన కె.మురళి, తిరువళ్లూరుకు చెందిన రుద్రమూర్తి, శివగిరికి చెందిన అనురాధలకు గాయాలయ్యాయి.

క్షతగాత్రులను నగరి ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రాథమిక వైద్యచికిత్స అందించి తీవ్రగాయాలైన వారిని మెరుగైన వైద్యసేవలకు తిరుపతి రూయాకు తరలించారు.

బస్సు వేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణమని ప్రయాణీకులు తెలుపుతున్నారు.

Related posts

భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా టీటీడీ మరో నిర్ణయం 

Garuda Telugu News

పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయండి

Garuda Telugu News

మాజీ మంత్రి విడదల రజినిపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం

Garuda Telugu News

Leave a Comment