
గీత కార్మికులకు మద్యం షాపులు హర్షణీయం
-గూడూరు, బాలాయపల్లి, ఓజిలి ఈడిగ లకు కేటాయింపు
-ఈడిగ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ససిమరా అంటున్న తాసిల్దారులు
-దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వడం లేదు…
-ఇదేమి చోద్యం అంటున్న కల్లు గీత కార్మికులు
,(గూడూరు
ఎన్నికల్లో కల్లుగీత కార్మికులకు మద్యం షాపులు కేటాయిస్తామని ఇచ్చిన హామీని తు.చ తప్పకుండా కూటమి ప్రభుత్వం అమలపరుస్తూ ప్రకటన జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 335 మద్యం షాపులను గీత కార్మికులకు కేటాయిస్తూ ఈనెల 27వ తేదీ నుండి ఫిబ్రవరి 5ప తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ప్రకటనలు జారీ చేశారు. ఈ క్రమంలో జనవరి 28వ తేదీన గూడూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఏ ఈ ఎస్ ఊహ కల్లుగీత కార్మికులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి గూడూరు, బాలాయపల్లి, ఓజిలి కేంద్రాలగా మద్యం షాపులను ఈడిగా కులాల వారికి కేటాయించారని ఫిబ్రవరి 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. గూడూరు ఎక్సైజ్ డివిజన్లోని గూడూరు, బాలాయపల్లి, ఓజిలి మండల కేంద్రాల్లో ఒక్కొక్కటి చొప్పున గీత కార్మికులైన ఈడిగ లకు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా గీత కార్మికులను వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా కుల ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయని ముఖ్యంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, తిరుపతి ప్రాంతాల్లో ఈడిగ, గూడూర్ డివిజన్లో గమళ్ల, గౌడ అని ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో శెట్టిబలిజ, నాగశయన, సొండి అని పిలుస్తారు.అయితే గూడూరు డివిజన్లోని కల్లుగీత కార్మికులకు గమళ్ల, గౌడ కులం పేరుతో కుల ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయని గౌడ సంఘ నాయకులు, కల్లుగీత కార్మికులు పేర్కొంటున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడం లేదు అన్న చందాన వ్యవహరిస్తున్నారని కల్లుగీత కార్మికులు వాపోతున్నారు. గూడూరు డివిజన్లో తాసిల్దారులు ఇచ్చే కుల ధ్రువీకరణ పత్రంలో గౌడ, గమళ్ళ ఇచ్చి ఉన్నారన్నారు. అయితే తిరుపతి జిల్లా పరిధిలోని శ్రీకాళహస్తి, తిరుపతి ప్రాంతాల్లో మాత్రమే ఈడిగ అని కుల ధ్రువీకరణ పత్రం ఇస్తారని గూడూరు డివిజన్లో ససేమిరా ఇచ్చేది లేదని తాసిల్దారులు పేర్కొంటున్నారనీ తెలిపారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా వారి ప్రయోజనాలను నెరవేరాల జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి కల్లుగీత కార్మికులకు ఈడిగ కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కల్లుగీత కార్మిక నాయకులు, కార్మికులు కోరుతున్నారు.
