
*రాష్ట్ర కార్యవర్గంలో చోటు…*
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ కార్యవర్గ సభ్యుడిగా *S.M.నాగరాజు*
ఉమ్మడి చిత్తూరు జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ప్రత్యేక సమావేశం శనివారం కాణిపాకంలో నిర్వహించారు. *ఈ సమావేశానికి ప్రత్యేక అతిథిగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళి హాజరై పలు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.* ఈ సమావేశంలో సత్యవేడు ప్రాంతానికి చెందిన సానాటి నాగరాజుకు రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నాగరాజు ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ నాయకులకు, ఉమ్మడి జిల్లా కార్యవర్గానికి నాగరాజు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
