
*ఫిబ్రవరి 3 న (నేడు) తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు పూర్తి: జేసి మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్*
తిరుపతి, ఫిబ్రవరి2: ఫిబ్రవరి 3వ తేదీన (నేటి సోమవారం) తిరుపతి జిల్లా నందు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్యక్రమ ప్రత్యేక సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జెసి మరియు సదరు ఎన్నికల నిర్వహణ ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్ పేర్కొన్నారు.
ఆదివారం ఉదయం స్థానిక ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్ నందు ఫిబ్రవరి 3న (నేడు) నిర్వహించుటకు జరుగుతున్న డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లను జెసి మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెనేట్ హాల్ నందు డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. సదరు ప్రత్యేక సమావేశం 11 గంటలకు నిర్వహించనున్న నేపథ్యంలో సంబంధిత కౌన్సిలర్లు మరియు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉదయం 11 గం.ల కంటే ముందుగా సెనేట్ హాల్ నందు హాజరు కావాలని, సెల్ ఫోన్లు అనుమతి లేదని, రిలేటివ్స్ కు అనుమతి లేదని, ఐడి కార్డు తప్పనిసరిగా తీసుకుని రావలసి ఉంటుందని ఎన్నికల నిర్వహణ అధికారి సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, స్మార్ట్ సిటీ జి.ఎం. చంద్రమౌళి,ఎస్ఈ సురేంద్ర, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య, సెక్రటరీ రాధిక, తహసీల్దార్ భాగ్యలక్ష్మి , ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
