
*లోకేష్ డిప్యూటీ సీఎం.. TDP హైకమాండ్ సంచలన ప్రకటన!* వ్యక్తిగత అభిప్రాయాలు తెలుగుదేశం పార్టీపై రుద్దవద్దని ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. లోకేష్ను ఉపముఖ్యమంత్రిని చేయాలని వస్తున్న ప్రతిపాదనలపై అధిష్టానం సీరియస్ అయ్యింది.అనవసరమైన అంశాలను మీడియా ముందు ప్రస్తావించొద్దని పార్టీ శ్రేణులను ఆదేశించింది తెలుగుదేశం పార్టీ. ఏ అంశం అయినా కూటమి పక్షాల అధినేతలు మాట్లాడతారని పార్టీ హైకమాండ్ తెలిపింది.లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలి…
కూటమి నేతలు చర్చించుకున్నాకే నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడవద్దని సూచించింది. ఏపీ ఐటీ మంత్రిగా ఉన్న లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలని గతకొన్ని రోజులుగా టీడీపీ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ను సీఎం చేయాలని జనసేన కార్యకర్తలు అంటున్నారు. ఈ విషయంపై సోమవారం తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్పందించింది.
