
*టిడిపి నేత శంకర్ భౌతికకాయానికి ఎమ్మెల్యే నివాళి*
పిచ్చాటూరు మండలం అడవి కోడియంబేడు కు చెందిన తెలుగుదేశం పార్టీ నేత ఎస్ శంకర్ అనారోగ్యంతో మృతి చెందారు.
సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సోమవారం మధ్యాహ్నం మృతుని స్వగ్రామమైన అడవి కోడియంబేడు కు చేరుకొని శంకర్ భౌతికకాయానికి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, శంకర్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
