
పత్రికా ప్రకటన తిరుపతి, 2025 జనవరి 20
దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన టిటిడి ఈవో
కడప జిల్లా దేవుని కడపలో గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ ను టిటిడి ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్లో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. జనవరి 28 నుండి ఫిబ్రవరి 7వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
ఇందులో భాగంగా జనవరి 28వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణ జరుగనుంది. జనవరి 29వ తేదీ ఉదయం 9.30 గంటలకు మీణ లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు (ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం భక్తులు పుష్పాలను సమర్పించవచ్చు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భక్తి సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సిఈ శ్రీ సత్యనారాయణ, డిప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, శ్రీమతి ప్రశాంతి తదితర అధికారులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
29-01-2025
ఉదయం – ధ్వజారోహణం,
రాత్రి – చంద్రప్రభ వాహనం.
30-01-2025
ఉదయం – సూర్యప్రభవాహనం,
రాత్రి – పెద్దశేష వాహనం.
31-01-2025
ఉదయం – చిన్నశేష వాహనం,
రాత్రి – సింహ వాహనం.
01-02-2025
ఉదయం – కల్పవృక్ష వాహనం,
రాత్రి – హనుమంత వాహనం.
02-02-2025
ఉదయం – ముత్యపుపందిరి వాహనం,
రాత్రి – గరుడ వాహనం.
03-02-2025
ఉదయం – కల్యాణోత్సవం,
రాత్రి – గజవాహనం.
04-02-2025
ఉదయం – రథోత్సవం,
రాత్రి – ధూళి ఉత్సవం.
05-02-2025
ఉదయం – సర్వభూపాల వాహనం,
రాత్రి – అశ్వ వాహనం.
06-02-2025
ఉదయం – వసంతోత్సవం, చక్రస్నానం,
రాత్రి – హంసవాహనం, ధ్వజావరోహణం.
—————————————-
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
