
హమాలీలకు ఇంటి స్థలాలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలి
– సిఐటియు నాయకులు ఎన్ నాగరాజు డిమాండ్
నారాయణవనం : ఆర్థికంగా వెనుకబడిన హమాలీలకు ఇంటి స్థలాలు ఇచ్చి ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని సత్యవేడు నియోజకవర్గ ప్రాంతీయ సిఐటియు నాయకులు ఎన్ నాగరాజు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రమైన నారాయణవనంలోని దిండి వినాయక స్వామి ఆలయ ఆవరణలో సిఐటియు ఆధ్వర్యంలో హామాలీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రాంతీయ సిఐటియు నాయకులు ఎన్ నాగరాజు మాట్లాడుతూ హమాలీలకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చి అన్ని విధాలుగా ముఠా కార్మికులకు సదుపాయాలు కల్పించాలని కోరారు. అనంతరం హమాలీలకు సిఐటియు సభ్యత్వం నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోసిపిఎం మండల కార్యదర్శిముని శంకర్, హమాలీలు ఆరుముగం,నాగరాజు,వెంకటేష్, సుబ్రహ్మణ్యం (సుబ్బు ) రాజేంద్ర,తదితరులు పాల్గొన్నారు.
