
*శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం హుండీల ద్వారా రూ.9,34,990/-, అన్నదానం హుండీ ద్వారా రూ.1,39,700/- లు మరియు విదేశీ కరెన్సీ ద్వారా 20 నోట్లు ఆదాయం.
* శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం హుండీల లెక్కింపు కార్యక్రమం *తిరుపతి డివిజన్ తనిఖీదారులు శ్రీ P.పణిరాజశయన* వారి పర్యవేక్షణలో *ఆలయ కార్యనిర్వహణాధికారిణి P. లత* వారి అధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.
81రోజులకు గాను దేవస్థానము హుండీలు లెక్కింపు ద్వారా రు.9,34,990/- లు అన్నదానం హుండీ ద్వారా రు.1,39,971/- లు ఆదాయం అంతే కాకుండా విదేశీ కరెన్సీ ద్వారా USA ద్వారా 55 డాలర్లు, మలేషియా నుండి 66 RM, కెనడా నుండి 10 డాలర్లు, సింగపూర్ నుండి 16 డాలర్లు, UAE నుండి 10 దినామ్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో KVBపురం పోలీస్ స్టేషన్ నుండి T. కేశవులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు….
