
*హత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్టు..*
*పిచ్చాటూరు సీ.ఎస్సై వెంకటేష్*
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం లోని అడవి కోడింబేడు దళిత వాడలో 17.1.2025 వ తేది ఉదయం 10 గంటలకు, అదే దళిత వాడ కు చెందిన ముద్దాయి D. చిన్న తంబి, తండ్రి; డేవిడ్ రాజ్, పాత కక్ష్యలను మనసులో పెట్టుకొని తన చిల్లర అంగడికి సరుకులు కొనుటకు వచ్చిన, అదే దళిత వాడకు చెందిన వెట్టి మనోహర్, వయస్సు 68 సంవత్సరాలు, అనే అతని పై చిన్న తంబి వెట్టి మనోహర్ పై చిన్న తంబి తన అంగడి లో ప్లాస్టిక్ బాటిల్ లో నింపి వుండిన పెట్రోల్ ను మనోహర్ పైన పోసి నిప్పు అంటించగా, మనోహర్ మంటలను భరించ లేక గట్టిగా కేకలు వెయ్యగా, చుట్టుపక్కల వారు వచ్చి మనోహర్ పైన నీళ్ళు పోసి మంటలను ఆర్పడమైనది. వెంటనే మనోహర్ బంధువుల సంఘటన స్థలం నకు వచ్చి, 108 అంబులెన్సు లో కాలిన గాయాలతో వున్న మనోహర్ ను నగిరి ప్రభుత్వ ఆసుపత్రికి లో చేర్పించడమైనది. ప్రస్తుతం మనోహర్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు.
సదరు కేసులో పరారీలో వున్న ముద్దాయి D. చిన్న తంబి ని పిచ్చాటూరు SI C. వెంకటేష్ కేసు నమోదు చేసి, తన సిబ్బంది సహాయంతో ముద్దాయి కొరకు గాలింపు చర్యలు చేపట్టి నిన్నటి దినం 19.01.2025 వ తేదీ సాయంత్రం SSB పేట చెక్ పోస్ట్ వద్ద అరెస్టు చేసి, ఈ దినం ముద్దాయిని సత్యవేడు JFCM, కోర్టు లో హాజరు పరచి ముద్దాయి ని రిమాండ్ కు తరలించ డమైనది.
సంఘటన జరిగిన 24 గంటల్లోపు కేసు నమోదు చేసి, తదుపరి 24 గంటల్లోపు పరారీ లో వున్న ముద్దాయిని, అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినందుకు గాను తన పై అధికారులు, సంబంధ పడిన బాధితులు మరియు గ్రామస్తులు పోలీస్ లకు అభినందనలు తెలిపారు.
