
తిరుపతి జిల్లా..
తిరుపతి జిల్లా ఎస్పి మరియు టీటీడీ ఇన్‌చార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపిఎస్., గారు అలిపిరి టోల్‌గేట్ వద్ద ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
సీసీ కెమెరాల పనితీరును స్వయంగా పరిశీలించి, విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడి వారి పనితీరుపై ఆరా తీసిన ఆయన, తనిఖీలను మరింత సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.
ఈ ఆకస్మిక తనిఖీల ప్రధాన లక్ష్యం:
శాంతి భద్రతలను పర్యవేక్షించడం.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల వాహనాల్లో అనుమానాస్పద కార్యకలాపాలను అరికట్టడం.
భక్తుల భద్రతను మెరుగుపరచడం.
తనిఖీల సందర్భంగా, విధుల్లో ఉన్న సిబ్బందిని మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని జాగ్రత్తగా పరిశీలించడంతో పాటు అనుమానాస్పద అంశాలను గుర్తించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. భక్తుల రద్దీ సమయంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా, శాంతి భద్రతలకు భంగం కలగకుండా, సకాలంలో స్పందించేలా టీటీడీ మరియు పోలీసు సిబ్బందిని సన్నద్ధంగా ఉండమని సూచించారు.
సకాలంలో స్పందించడం వల్ల భక్తులకు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడంలో ఇది దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో అలిపిరి సీఐ రామకిషోర్ మరియు టీటీడీ విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.
