
*విశాఖ*
*స్టీల్ ప్లాంట్‌కు గుడ్ న్యూస్.. రూ.11,500 కోట్లతో భారీ* *ప్యాకేజీ..!* విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రూ. 11,500 కోట్ల ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి.అయితే ఇందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్ ప్లాంట్‌ను నడిపేందుకు అటు ఆమోదం తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇప్పుడిప్పుడే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని గతంలోనే కేంద్రమంత్రి కుమారస్వామి తెలిపారు. దీంతో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విధానాలపై పలుమార్లు చర్చలు జరిపారు. మరోవైపు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రతిపాదనలకు కేబినెట్ కూడా ఆమోదించినట్లు తెలుస్తోంది.
