
* ఎమ్మెల్యే గారిచే హాస్టల్ వీధి సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ*
*అందరు హాజరు కావాలని విజ్ఞప్తి*
*ఏఏంసి మాజీ చైర్మన్, టిడిపి క్లస్టర్ ఇన్చార్జి ఇలంగోవన్ రెడ్డి పిలుపు*
శుక్రవారం పిచ్చాటూరు ప్రభుత్వ బీసీ బాలికల సంక్షేమ హాస్టల్ వీధి కి రూ.18 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారి చేతుల మీదుగా భూమి పూజ చేయనున్నట్లు ఏఏంసి మాజీ చైర్మన్, టిడిపి క్లస్టర్ ఇన్చార్జి ఇలంగోవన్ రెడ్డి ప్రకటించారు.
ఉదయం 10 గంటలకు గౌరవ ఎమ్మెల్యే గారు పిచ్చాటూరుకు చేరుకొని సీసీ రోడ్డు భూమి పూజ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
*మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం*
