
ఇస్రో కొత్త చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వి. నారాయణన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త ఇస్రో చైర్మన్గా వి. నారాయణన్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇస్రో చైర్మన్ గా కొనసాగుతున్న డాక్టర్ సోమనాథ్ ఈనెల 13వ తేదీ పదవీకాలం ముగియడంతో నూతన ఇస్రో చైర్మన్ గా వి. నారాయణన్ కు జనవరి 14వ తేదీ బాధ్యతలు అప్పగించారు. వి. నారాయణన్ తమిళనాడులోని కన్యాకుమారి లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన వి. నారాయణన్ ఐఐటి కరక్ పూర్లో క్రయోజనిక్ ఇంజనీరింగ్ లో మొదటి ర్యాంకుతో ఎంటెక్ పూర్తి చేశారు. 2001 స్పేస్ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ పూర్తి చేశారు. రెండు సంవత్సరాలు నారాయణన్ ఇస్రో చైర్మన్గా కొనసాగుతారు. నారాయణన్ ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రపోషన్ సిస్టం సెంటర్ కు Director గా వ్యవహరిస్తున్నారు. ఇస్రోలో నాలుగు దశాబ్దాలుగా వివిధ హోదాల్లో పనిచేశారు. రాకెట్, స్పేస్ క్రాఫ్ట్ చోదక వ్యవస్థలో ఆయనకు అపార అనుభవం ఉంది. ద్రవ, సెమీ క్రయేజిని, క్రయోజనిక్, చోదక వ్యవస్థ అభివృద్ధిలో ఆయన పాలుపంచుకుంటూ ఉన్నారు. ఇస్రోకు చెందిన జి ఎస్ ఎల్ వి మార్క్ 2, మార్క్ 3 వాహక నౌక రూపకల్పనలో కీలక భూమిక పోషించారు. ఆదిత్య L1 చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 లోని చోదక వ్యవస్థల అభివృద్ధికి ఆయన కృషి చేశారు. నూతన ఇస్రో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినందుకు ఇస్రో చైర్మన్ కు శాస్త్రవేత్తలు, షార్ఉద్యోగస్తులు, అభినందనలు తెలిపారు.
