
సినీనటుడు మంచు మనోజ్ మంత్రి నారా లోకేశ్‌ని కలిశారు. మనోజ్ కుంటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ర్యాలీతో చేరుకున్నారు. ఈ క్రమంలో కోర్టు ఆర్డర్ నేపథ్యంలో లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు.*
*పోలీసుల సూచనతో వెనుదిరిగిన మనోజ్ నేరుగా నారావారిపల్లె వెళ్లారు. భార్య మౌనికతో కలిసి లోకేశ్‌తో భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. అనంతరం అక్కడి నుంచి ఎ.రంగంపేటలో జరుగుతున్న పశువుల పండగలో పాల్గొనేందుకు మనోజ్ దంపతులు వెళ్లారు. సాయంత్రం మోహన్‌బాబు యూనివర్సిటీ ఆవరణలో ఉన్న తన నానమ్మ, అమ్మమ్మ సమాధుల వద్ద నివాళులర్పించిన తర్వాత తిరిగి హైదరాబాద్ వెళ్తారని మంచు మనోజ్ సన్నిహితులు పేర్కొన్నారు.*
*మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద భారీ బందోబస్తు : మరోవైపు తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. యూనివర్సిటీకి మంచు మనోజ్ వస్తున్నారన్న సమాచారంతో గేటు వద్ద పోలీసులు వేచి ఉన్నారు. ఇప్పటికే యూనివర్సిటీలో మోహన్‌బాబు, మంచు విష్ణు ఉండడంతో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కాలేజీ పరిసర ప్రాంతాల్లోకి ఎవ్వరినీ అనుమతించడం లేదు. గేట్లను కూడా మూసివేశారు.*
