Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్‌కూ కొత్త కార్పొరేట్ కార్యాలయం !

కాంగ్రెస్‌కూ కొత్త కార్పొరేట్ కార్యాలయం !

 

 

అధికారంలోకి వచ్చిన వెంటనే ఢిల్లీలో బీజేపీ అతి పెద్ద కార్యాలయాన్ని నిర్మించుకుంది. ఆ పార్టీకి విరాళాలు లెక్కలేనన్ని వస్తూంటాయి. ఓ రకంగా దేశంలో అన్ని పార్టీలకు వచ్చే విరాళాల కన్నా ఒక్క బిజేపీకి వచ్చే విరాళాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు కొత్తగాఓ కార్యాలయం కట్టుకుంది. బీజేపీ స్థాయిలో కాకపోయినా ఓ విశాలమైన కొత్త ఆఫీసుకుని నిర్మించుకుని ..అందుకోలిక మారిపోతున్నారు. బుధవారం సోనియాగాంధీ కాంగ్రెస్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు.

ఈ వేడుకలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీ చేరుకుంటున్నారు. ఢిల్లీలో ‘24 అక్బర్ రోడ్’ ఇప్పటి వరకూ ఏఐసిసి కార్యాలయంగా ఉంది. దాదాపుగా ఐదు దశాబ్దాల నుంచి అదే ఆఫీసు. ఇప్పుడు కొత్త ఆఫీసుని దీన్దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్ కి మారుస్తున్నారు. ఇది నిన్నా మొన్న అనుకున్నది కాదు. పదిహేనేళ్ల కిందటే నిర్మాణం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టే అభివృద్ధి పనుల్లా .. పార్టీ ఆఫీసు నిర్మాణం మెల్లగా సాగింది. 2009లో సోనియా ఏఐసీసీ నేతగా ఉన్నపుడు నిర్మాణం ప్రారంభించారు.

జన్ సంఘ్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన దీన్దయాళ్ ఉపాధ్యాయ పేరిట ఉన్న రోడ్ లో కాంగ్రెస్ కొత్త ఆఫీసు ఉండటాన్ని ఆ పార్టీ నాయకత్వం ఇష్టపడటం లేదు. అందుకే వెనుక గేట్ నే మెయిన్ గేట్‌గా ప్రకటించి వెనుక గేట్ నుంచి రాకపోకలు జరిపేలా నిర్ణయించి, పార్టీ కార్యాలయ చిరునామాను ‘9ఎ కోట్ల రోడ్’గా ప్రకటించారు. దీనికి ఇందిరా భవన్ అని పేరు పెట్టారు. కొత్త కార్యాలయంతో అయినా కాంగ్రెస్ ఫేట్ మారుతుందో లేదో మరి !

Related posts

మా తెలుగు టీచర్ తొండు కృష్ణయ్య గారు మాకు టీచర్ గా కావాలి (AISF )

Garuda Telugu News

మార్చి 31 లోపు 2019 లో పెండింగ్ ఉన్న బి.పి.ఎస్., ఎల్.ఆర్.ఎస్.కి దరఖాస్తు చేసుకోండి

Garuda Telugu News

దేశంలో ఏ ఉద్యమం గురించి మాట్లాడుకున్నా తొలిగా గుర్తుకొచ్చే ఉద్యమకారుడు జ్యోతిరావు పూలే

Garuda Telugu News

Leave a Comment