
*బాబన్న…. సత్యవేడు రోడ్ల దుస్థితి చూడన్నా….!!*
*సంక్రాంతి వచ్చేసినా… రోడ్లు దరిద్రం వీడలేదు…*
*ఏ అధికారికి చెప్పినా… స్పందన లేదు..*
బాబన్న.. మీరిచ్చిన ఆదేశాలు సత్యవేడు నియోజకవర్గంలో పట్టించుకునే దిక్కే లేదు సంక్రాంతి లోపు అద్వానపు రోడ్లు… అందంగా చేస్తామని, ఆ దిశగా ఆదేశాలు ఇచ్చామని మీరు చెప్పారు ఆ ఆదేశాలను, ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో ఇక్కడ ఏ అధికారి ముందుకు రావడం లేదు సత్యవేడు – ఊతుకోట రోడ్డు పూర్తిస్థాయిలో గుంతల మయంగా మారింది అప్పుడప్పుడు ఈ రోడ్లమీద తమిళనాడుకు ఎర్రమట్టి రవాణా సాగుతోంది దాంతో పాటు పివిపురం పంచాయతీ నుంచి జోరుగా కంకర, కంకర దువ్వ టన్నులకొద్దీ నిత్యం తమిళనాడుకు సాగుతోంది బిల్లులో ఒక లెక్క… బిల్లు లేకుండా మరో లెక్క అన్నట్లు జోరుగా ఈ కంకర వ్యాపారం సాగుతోంది రోడ్లమీద గుంతలను పూడ్చే దిక్కేలేదు దాంతోపాటు వెంకట రాజుల కండ్రిగ – టీపి పాలెం రోడ్డు, బీర కుప్పం – నాగలాపురం రోడ్డు, టీపీ కోట – పివిపురం రోడ్డు దుస్థితికి చేరింది స్థానిక ఆర్ అండ్ బి అధికారులను కనీసం మరమ్మతులు చేయాలని పలుమార్లు కోరుతున్న ప్రయోజనం లేదు పెద్ద పండుగ… గుంతలు లేని రోడ్లు చేస్తామని మీరిచ్చిన ఆదేశాలను సత్య వేడు ప్రాంతంలో అమలు కావడం లేదు తమిళనాడుకు సరిహద్దు లో ఉన్న సత్యవేడు నియోజకవర్గంలో గత ఆరు మాసాలుగా చెప్పుకోదగ్గ ఒక్క పని కూడా జరగలేదని ప్రజలు వాపోతున్నారు శ్రీ సిటీకి దగ్గరలో ఉన్న ఈ రోడ్ల దుస్థితిపై స్పందించే దిక్కు లేకపోవడం వల్ల నిత్యం పరిశ్రమలకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది పడే అవస్థలు వర్ణనాతీతం కనీసం ప్రధాన రోడ్లమీద గుంతలను కూడా పూడ్చడం లేదు ఏఈల కొరత, ఇన్చార్జిల బాధ్యతలు సత్య వేడు ప్రాంతంలో ఆర్ అండ్ బి శాఖకు శాపంగా మారింది ఇక దాసు కుప్పం బైపాస్ రోడ్డు కాగితాలకే పరిమితమైంది భూ సేకరణ, ఇతర పనులు చక చకా సాగి మిగిలిన విషయాలు అటకెక్కించారు ఇంద్రుడు, చంద్రుడు, పేదల పక్షపాతి, ప్రముఖ పారిశ్రామికవేత్త వంటి బిరుదులతో పలువురు నియోజకవర్గంపై పెత్తనం చలాయిస్తున్నారే గాని ప్రగతి విషయాలపై, భూకబ్జాలను అరికట్టడంలో ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదని ప్రజలు వాపోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి రోడ్ల మరమ్మత్తులు, సత్యవేడులో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు, వంద పడకల ఆసుపత్రి నిర్మించి ఇక్కడ పేదల ఇబ్బందులు తొలగిస్తారని నియోజకవర్గ వాసులు ఎదురుచూస్తున్నారు
