
*తెలుగు కీర్తి జాతీయ ప్రతిభా పురస్కారం అందుకోనున్న పిచ్చాటూరు మండల విద్యాశాఖధికారిణి కె హేమమాలిని*
పిచ్చాటూరు:
తెలుగు కీర్తి “జాతీయ ప్రతిభా పురస్కారానికి తిరుపతి జిల్లా, పిచ్చాటూరు మండల విద్యాశాఖధికారిణి k. హేమమాలిని ఎంపికయ్యారు. ISO గుర్తింపు పొందిన అంతర్జాతీయసాహితీసంస్థ శ్రీశ్రీ కళావేదిక ఇచ్చే ఈ అవార్డు కు హేమమాలిని ఎంపికైనట్లు సంస్థ సి. ఈ. ఓ డాక్టర్ కట్టిమండ ప్రతాప్ గారి నుండి ఆహ్వానం అందినట్లు తెలిపారు. శ్రీ శ్రీ కళావేదిక, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రైటర్స్ ఫోరం, వరల్డ్ పోయెట్రీ అకాడమీ సంయుక్త ఆధ్వర్యం లో పురస్కారం అందుకోనున్నారు. పిచ్చాటూరు మండల విద్యాశాఖధికారిణి గా విధులు నిర్వహిస్తూ, రచనలు, కవిసమ్మేళనలు ల్లో పాల్గొంటూ,గాయనిగా తెలుగుభాషా సంస్కృతి, సాహిత్యం, కళల పరిరక్షణకై నిరంతరం సామాజిక కార్యక్రమాల్లో రాణిస్తున్న హేమమాలిని గారికి తెలుగు కీర్తి జాతీయ ప్రతిభా పురస్కారం కు ఎంపిక కావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.. ఈ సందర్బంగా ఆమె సంస్థ సి. ఈ. ఓ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారికి ధన్యవాదములు తెలిపారు.
