
తిరుపతి జిల్లా పర్యటనకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
రేణిగుంట, జనవరి 12: తిరుపతి జిల్లా పర్యటన కు ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం లభించింది.
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు, డీఐజీ షిమోషిబాజ్పాయ్,చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాద్ రావు,జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఇంచార్జి జిల్లా ఎస్పీ మణికంఠ ఛందోలు, రాష్ట్ర నాయీబ్రాహ్మణ చైర్మన్ సాదాశివం, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి, నగరి,గంగాధర్ నెల్లూరు, ఎమ్మెల్యేలు పులివర్తి వెంకట ముని ప్రసాద్(నాని) బొజ్జల సుధీర్ రెడ్డి, కోనేటి ఆదిమూలం, అరణి శ్రీనివాసులు, భాను ప్రకాష్, డాక్టర్ వి.యం థామస్,సులూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, కోలా ఆనంద, బాలసుబ్రహ్మణ్యం, హరి ప్రసాద్, నరసింహా యాదవ్,సి ఆర్ రాజన్, తెలుగుదేశం, బిజెపి,జనసేన పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పట్టణ అబివృద్ది శాఖ మంత్రి పి.నారాయణ ఉన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుపతి కి రోడ్డు మార్గాన బయలుదేరారు.
——డి ఐ పి ఆర్ ఓ, తిరుపతి —-
