
*తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాలతో నూతన సంవత్సర వేడుకలపై నిఘా*
రాబోవు నూతన సంవత్సర వేడుకను ప్రజలు ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలనేదే పోలీసు శాఖ ఉద్దేశం__*సత్యవేడు సిఐ మురళి…*
అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు…
ఈ సందర్భంగా సిఐ మురళి మాట్లాడుతూ నూతన సంవత్సరాన్ని ప్రజలు ముఖ్యంగా యువకులు ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే… శృతి మించితే చర్యలు తప్పవని హెచ్చరించారు…
రాత్రి 12 గంటల సమయంలో ద్విచక్ర వాహనాలు ,కార్లతో హారంలో కొడుతూ శబ్ద కాలుష్యానికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి, మైనర్ పిల్లలు వాహనాలు నడిపితే ఉపేక్షించే ప్రసక్తే ఉండదు కాబట్టి వారి తల్లిదండ్రులు నిగాబెట్టాలి వారిపై,
31 వ తేదీన రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు సత్యవేడు సిఐ పరిధిలోని వరదయ్యపాలెం, సత్యవేడు ,నాగలాపురం మండలాలలో వాహనాల తలిఖీలు ముమ్మరంగా చేయబడతాయి….
మద్యం షాపులు కూడా నిర్దేశించిన సమయానికి మూసివేయాలి లేకపోతే చర్యలు కచ్చితంగా తీసుకుంటాం…
వీధుల్లో కేకులు కట్ చేయడం, వేదికలు పెట్టి హంగామా చేయడం చేయకూడదు…
అశ్లీల నృత్య కార్యక్రమాలు, డిజె సౌండ్, రికార్డింగ్ డాన్స్, లు నిర్వహించేందుకు అస్సలు అనుమతులు లేవు..
నూతన సంవత్సర వేడుకల ముసుగులో బైక్ లు, కార్లు అతివేగంగా నడిపితే బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన జూదం ఆడిన చర్యలు తప్పవని తెలియజేశారు
