*ప్రభుత్వ నిధులు దూర్వినియోగం అవుతున్నాయి అని ప్రశ్నిస్తే బెదిరింపులా…??*
*గ్రామ స్థాయిలో కొంతమంది నాయకులు చేస్తున్న పనులకు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు…!*
*రోడ్డు మీద రోడ్డు వేస్తున్నట్టు వచ్చిన కథనాలపై బెదిరిస్తున్న నాయకులు…??*
సత్యవేడు నియోజకవర్గం,బిన్ కండ్రిగ మండలం,కుక్కంబాకం పంచాయితీ లో రెండు రోజుల క్రితం సిమెంట్ రోడ్డుకు సంబందించి రోడ్డు మీద రోడ్డు వేస్తున్నట్టు వచ్చిన కథనాలపై వార్త పోస్ట్ చేసిన రిపోర్టర్ ని ఆ గ్రామానికి చెందిన నాయకుడు ఒకరు నీ అంతు చూస్తాను అంటూ బెదిరింపులకు దిగారు.
గ్రామస్తుల సమాచారం మేరకు గ్రామంలో చాలా వీధులకు సిమెంట్ రోడ్డు లేక ఇబ్బంది పడుతుంటే కొంతమంది నాయకులు తమ స్వార్థ ప్రయోజనాలు కోసం ఉన్న రోడ్డు మీద మళ్ళీ రోడ్డు వేసుకుంటున్నారు అని ప్రభుత్వ నిధులు దూర్వినియోగం అవుతున్నాయానే ఉద్దేశంతో వార్త పెడితే ఆ రిపోర్టర్ పై బెదిరింపులకు దిగినట్టు సమాచారం.
*కోసమేరుపు…🤷*
సాధారణంగా MGNREGS నిధులు కింద సాంక్షన్ అయిన సిమెంట్ రోడ్లు… రోడ్డు లేని దగ్గర వెయ్యాలి. ఒక వేళ ఇదవరికే ఉన్న సిమెంట్ రోడ్డు పై మళ్ళీ రోడ్డు వేస్తె ఆ రోడ్డుకి బిల్లు చేయడం నిబంధనలకు విరుద్ధం. ఇదే విషయమై బిన్ కండ్రిగ మండల పి ఆర్ ఏ ఇ ని వివరణ కోరితే ఆలా రోడ్డు వేయడం తప్పు, బిల్లు పెట్టడం కుదరదు అని చెబుతూ… ఇదే విషయాన్నీ ఈ రోజు కూడా రోడ్డు వేస్తున్న నాయకులకు సమాచారం ఇవ్వడం కోసమెరూపు…??
*బెదిరింపులపై పిర్యాదు…!!*
తాను పోస్ట్ చేసిన వార్త పై కొంతమంది నాయకులు తనను బెదిరించడం జరిగింది అని కావున స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయనున్నట్టు అదేవిధంగా వివరణ అడిగిన సంబంధిత అధికారి నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు వేస్తున్న వారికి సమాచారం ఇవ్వడం పై కలెక్టర్ కి పిర్యాదు చేయనున్నట్టు సమాచారం…??

