ఆంజనేయస్వామి ఆలయంలో కన్నుల పండుగగా హనుమాన్ జయంతి వేడుకలు
……………………………………………………………..
జైశ్రీరామ్ జైజై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిన ఆలయం.
….. సత్యవేడు పట్టణం శ్రీఆంజనేయ స్వామిఆలయంలో కన్నుల పండుగగా హనుమాన్ జయంతి వేడుకలు జరిగింది.శ్రీఆంజనేయస్వామి జన్మదిన పురస్కరించుకుని ఆలయంలో ధర్మకర్త నాగభూషణంశ్రీదేవి పర్యవేక్షణలో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు
నిర్వహించారు.ఆలయాన్ని మామిడి తోరణాలు,అరటి,పుష్పాలతో అలంకరించారు
❄ప్రత్యేక అర్చకులు రామ్మూర్తి శ్రీఆంజనేయస్వామి వారికి వైదిక కార్యక్రమాలను జరిపించారు.ఇందులో భాగంగానే తొలత గణేశ పూజతో పూజాక్రతువును ప్రారంభించారు.ఈ నేపథ్యంలో నవగ్రహ పూజ ప్రధానకలసపూజ,హోమం నిర్వహించారు. తదనంతరం సత్యవేడు పట్టణానికి చెందిన ఉభయదారులుగా బేరిశెట్టి సేవా సంఘం అధ్యక్షులు రాజేష్ కుమార్ సెల్వరాణి వ్యవహరించారు.
🌎ప్రధాన కళాశాలతో ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసిన తర్వాత శ్రీఆంజనేయస్వామి వారికి పంచామృతాలతో అభిషేకం,వివిధ సువాస భరిత పుష్పాలతో అలంకరణ చేశారు.ప్రత్యేకంగా శ్రీఆంజనేయ స్వామివారికి పాలాభిషేకం నిర్వహించారు.అనంతరం వందలాదిమంది హనుమాన్ భక్తుల మధ్య స్వామి వారికి ప్రధాన హారతి ఇచ్చారు.
తదనంతరం హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న భక్తులందరికీ అన్నదానం చేయడం జరిగింది.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీఆంజనేయ స్వామికి పూజలు చేశారు.
