Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

సీయం చంద్రబాబు సహకారంతో చిత్తూరు పార్లమెంటు సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడుతున్నా

సీయం చంద్రబాబు సహకారంతో చిత్తూరు పార్లమెంటు సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడుతున్నా

చిత్తూరు చారిత్రాత్మక నేపథ్యాన్ని వెలుగెత్తి చాటుతున్నా

ఏపీకి కేటాయించే పథకాల అమలుకు సంబంధించి వివరాలను రాబడుతున్నా..

అమలయ్యే పథకాల సమాచారాన్ని అందించడంలో కేంద్రం మంత్రుల స్పందన అభినందనీయం

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, చిత్తూరు ప్రగతి విషయంలో కేంద్రం అందిస్తున్న తోడ్పాటు హర్షణీయం

చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు

చిత్తూరు (ఢిల్లీ)-04-12-25

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో చిత్తూరు పార్లమెంటు సర్వతోముఖాభివృద్ధి కోసం

చిత్తశుద్ధితో పని చేస్తున్నానని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలియజేశారు.

ఎన్డీఏ సర్కార్ అందించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో తాను ముందున్నట్లు చెప్పారాయన.

చిత్తూరు చారిత్రాత్మక నేపథ్యాన్ని వెలుగెత్తి చాటి, సంస్కరణలను రాబట్టేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

శీతాకాల పార్లమెంటు సమావేశాలకు హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..,ఏపీకి కేటాయించే పథకాల అమలుకు సంబంధించిన వివరాలను రాబడుతున్నారు.

అడిగిన సమాచారాన్ని తక్షణం అందించడంలో కేంద్రం మంత్రులు జవాబుదారీగా వ్యవహరించడం అభినందనీయమన్నారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు…

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఎన్డీఏ సర్కార్ అందిస్తున్న తోడ్పాటు , కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన వివరాలను లిఖిత పూర్వకంగా తమకు అందించడం హర్షించదగ్గ విషయమని ఆయన కొనియాడారు.

2024-2029 సంవత్సరాలకు “ఇనోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ (4.0)”ని ఎన్డీఏ సర్కార్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ,. ఈ పాలసీ లక్ష్యం 20,000 కొత్త స్టార్టప్‌లను 1,00,000 ఉద్యోగాలను సృష్టించడమని తెలియజేశారు.

భారత రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే రైషన్‌ల్లో అనేక కొత్త చర్యలు తీసుకుంటామని ప్రకటించిన విషయాన్ని ఆయన వెల్లడించారు.

భారత రైల్వే నవంబర్ 2025లో 135.7 మిలియన్ టన్నుల ఫ్రైట్ లోడింగ్ నమోదు చేసిందని, ఇది గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే 4.2% పెరుగుద అని వివరించారు. రెండు నుండి మూడు సంవత్సరాలలో 200 వందే భారత్ రైళ్లు, 100 అమృత్ భారత్ రైళ్లు, 50 నమో భారత్ రాపిడ్ రైల్ సర్వీసులను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోందన్నారు.

ట్రాక్ పునరుద్ధరణ, సిగ్నలింగ్ అప్‌గ్రేడ్‌లు , టెలికాం మెరుగుదలలతో సహా భద్రత అంశాలకు సంబంధించి ₹1,16,514 కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు తానడిగిన లిఖిత పూర్వక ప్రశ్నలకు సమాధానాలిచ్చినట్లు తెలిపారాయన.

డిజిటల్ ఇండియా పథకం,భారత్ నెట్ ప్రాజెక్ట్, ప్రధాన మంత్రి వీ గ్రామ్ యోజన పథకాల కింద

పాఠశాలల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలియజేశారు.

Related posts

సమస్యలపై ముఖ్యమంత్రికీ శంకర్ రెడ్డి వినతి…

Garuda Telugu News

సత్యవేడు రెవిన్యూ డిజిజన్ ఏర్పాటు చేయండి

Garuda Telugu News

సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ శ్రీపతి

Garuda Telugu News

Leave a Comment