అధిష్టాన నిర్ణయమే అందరికీ శిరోదార్యం…సైకిల్ గుర్తే మన నిర్దేశం…తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ…టిడిపి కార్యకర్తల సమావేశంలో పరిశీలకులు మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి…

టిడిపిలో ఉన్న ప్రతి కార్యకర్త,నాయకులందరూ పార్టీ అధిష్టానం గొడుగు కింద పనిచేయాల్సి ఉందని, అందువల్ల పార్టీపరంగా తీసుకుంటున్న అధిష్టాన నిర్ణయాలు కూడా అందరికీ శిరోధార్యమని టిడిపి ప్రత్యేక పరిశీలకులు మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు.మంగళవారం సత్యవేడు బేరిశెట్టి కళ్యాణమండపంలో టిడిపి మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి సంస్థాగత ఎన్నికలపై కార్యకర్తలు నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మారెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్ల రాక్షస పాలనను అంతమొందించడానికి అనేక పరీక్షలను ఎదుర్కొని పార్టీ జెండాలు మోసిన నాయకులకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు.ఇటువంటి ట్రాక్ రికార్డు ఉన్న వారిని గుర్తించి పదవుల్లో అందలం ఎక్కిస్తామన్నారు.
ఈ విషయంలో ఎటువంటి అపోహలకు తావు లేదన్నారు.ఇక్కడ కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో టిడిపి సంస్థాగత ఎన్నికలు ఆలస్యమైందన్నారు.టిడిపి ఎప్పుడూ కూడా సంస్థగతంగా బలమైందన్నారు.క్షేత్రస్థాయిలో స్థాయిలో గ్రామ కమిటీలు మొదలు మండల,జిల్లా,రాష్ట్రస్థాయి కమిటీల వరకు ప్రజాస్వామ్యబద్ధంగా కార్యకర్తల మెజార్టీ అభిప్రాయం మేరకు తుది నిర్ణయాలు ఉంటుందన్నారు.
మండలంలో 28 పంచాయతీలో కూడా షెడ్యూల్ ప్రకారం పరిశీలకులు పర్యటించే స్థానిక నాయకులు కార్యకర్తలు అభిప్రాయాలు కూడా తెలుసుకుంటామన్నారు.మీ నాయకులను మీరే ఎన్నుకోండి లేదంటే అధిష్టాన నిర్ణయానికి కట్టుబడాల్సి ఉన్నట్టు ఆయన తేల్చి చెప్పారు.గ్రామ కమిటీ లోను,మండల కమిటీలలోను పోటీ ఏర్పడితే ఐవిఆర్ఎస్ ద్వారా తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
❄టిడిపి పార్టీ ఎప్పుడు కూడా క్రమశిక్షణకు పెట్టింది పేరు అన్నారు. అయితే క్రమశిక్షణను ఉల్లంఘిస్తే మాత్రం ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన కుండ బద్దలు కొట్టారు.ఈ సమావేశంలో మాజీ టిడిపి మండల అధ్యక్షులు పరమశివం,మాజీ ఎంపీపీ మస్తాన్,క్లస్టర్ ఇంచార్జ్ శివ కుమార్ నాయుడు,నాయకులు లోకయ్య రెడ్డి, ఈశ్వర్,నరేంద్ర, బాలరాజ్, కృష్ణ చైతేన్య, బాబు, కోనయ్య, కిష్టయ్య,రవి, ప్రభాకర్, కోటేశ్వరవు,చంద్రశేఖర్ రెడ్డి, లోకయ్య రెడ్డి,మురళి( చికెన్ చిన్న) సర్పంచులు గోవిందస్వామి,రూబెన్ పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
