మసీదు కమిటీలు ముతవల్లీలు ఇమామ్ మౌజన్ లకు జీతాలు ఇవ్వాల్సిందే.

ఇమామ్ మౌజన్ ల గౌరవ వేతనాలకు జీతాలకు ముడిపెట్టొద్దు.
వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు గౌరవ వేతనాలు ప్రవేశపెట్టాం.
గౌరవ వేతనాలే జీతాలు అని ఇబ్బంది పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
ఇమామ్ మౌజన్ లకు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత కమిటీలు, ముతవల్లీల పై ఉంది.
డైరెక్ట్ గా ఇమామ్ మౌజన్ ల అకౌంట్లో గౌరవ వేతనాలు వేయాలని ఆలోచిస్తున్నాం.
ఇల్లు లేని పేద ఇమామ్ మౌజన్ లకు ప్రభుత్వం నుంచి ఇల్లు ఇప్పిస్తాం.
– షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు.
ఇమామ్ మౌజన్ ల 12 నెలల గౌరవ వేతనాలు విడుదలైన సందర్భంగా నెల్లూరు లోని ఇమామ్ మౌజన్ లు ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ను హరనాథపురం లోని వారి నివాసంలో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ఇమామ్ మౌజన్ లకు రావాల్సిన గౌరవ వేతనాలు ఆలస్యమై ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిన ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముస్లింల పట్ల చంద్రబాబుకు ఉన్న నిబద్ధతతో ఇమామ్ మౌజన్ లకు రావాల్సిన 12 నెలల గౌరవ వేతనాలు విడుదల చేశారని అన్నారు. ఇటీవల కాలంలో గ్రామీణ ప్రగతి బ్యాంకులు ఇతర బ్యాంకులో విలీనం కావడం వల్ల 5 వేల మందికి గాను 8 వందల మందికి ఐఎఫ్ఎస్సి కోడ్ సరిగా లేనందున డబ్బులు ఆలస్యమయ్యాయని తెలిపారు. నూతన ఐఎఫ్ఎస్సి కోడ్ ని అప్లోడ్ చేయగానే వారి గౌరవ వేతనాలు వారి అకౌంట్లో పడతాయని తెలిపారు. రాష్ట్రంలోనీ మసీదుల ప్రెసిడెంట్లు ముతవల్లీలు, ఇమామ్ మౌజన్ లకు జీతాలు ఇవ్వాల్సిందేనని జీతానికి గౌరవ వేతనానికి ముడి పెట్టొద్దని వారికి జీతం ఇవ్వాల్సిన బాధ్యత మసీదు కమిటీలపై ఉందని అన్నారు. ఇమామ్ మౌజన్ లను ఆర్థికంగా ఆదుకునేందుకే గౌరవ వేతనాలు తీసుకొచ్చామని వారికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. డైరెక్ట్ గా ఇమామ్ మౌజన్ ల అకౌంట్ లోకి గౌరవ వేతనాలు వేసేందుకు ఆలోచిస్తున్నామని త్వరలో నిర్ణయిస్తామని పేర్కొన్నారు. గౌరవ వేతనాలే జీతాలని చెప్పి సరిపెట్టడం సరికాదని ఇమామ్ మౌజన్ లను ఇబ్బంది పెడితే సహించబోనని అన్నారు. గత 2014 – 19 ప్రభుత్వ హయాంలో ఇమామ్ మౌజన్ లకు ఇళ్ల స్థలాలను ప్రతిపాదించి పలు భూములను పరిశీలించామని ప్రభుత్వం మారటంతో అది ఆగిపోయిందని అన్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇంటిని ఇవ్వాలన్న బాధ్యత లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళుతుందని ఇప్పటివరకు ఎవరికైతే ఇల్లు లేదో ప్రభుత్వం వద్ద నుండి ఎవరైతే తీసుకోలేదో అటువంటి ఇమామ్ మౌజన్ లకు ఇంటి స్థలాలను ఇప్పిస్తామని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో జాఫర్ షరీఫ్, ఇంతియాజ్, సమీ హుస్సేని, నౌషాద్, కాలేషా, అబ్దుల్ అజీజ్ మౌలానా, ఇమామ్ లు మౌజన్ లు పాల్గొన్నారు.
