తేదీ: 15-11-2025,
పిచ్చాటూరు మండలం,(ఎంకేటి మహల్)
తిరుపతి జిల్లా.

ప్రతి నియోజకవర్గంలోని యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని , అందులో భాగంగానే *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ మరియు సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ కోనేటి ఆదిమూలం గారు , శాసనసభ్యులు, సత్యవేడు నియోజకవర్గం వారి యొక్క సహాయ సహకారాలతో* ఎంకేటి మహల్, పిచ్చాటూరు నందు *జాబ్ మేళా* నిర్వహించడం జరిగినది.
ఈ జాబ్ మేళా కార్యక్రమంలో *ముఖ్య అతిథులుగా * శ్రీ కోనేటి ఆదిమూలం గారు, గౌరవ శాసనసభ్యులు గారు జాబ్ మేళా ను ప్రారంభించారు.*
ముఖ్య అతిధులు *శ్రీ కోనేటి ఆదిమూలం గారు ,MLA గారు,* జాబ్ మేళా ను ఉద్దేశించి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రివర్యులు 20 లక్షలు ఉద్యోగాలలో భాగంగా సత్యవేడు నియోజకవర్గంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించబడుతుందని తెలియజేశారు.ఇక్కడ ఈరోజు జాబ్ మేళా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.ఈ జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన వారికి 13500/- నుంచి 25000/- వరకు వేతన సదుపాయం కలదు అని తెలియజేశారు అదేవిధంగా ఉద్యోగంలో సెలెక్ట్ కాని వారికి త్వరలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ప్రభుత్వ పాలటెక్నిక్ కళాశాల ,సత్యవేడు నందు స్కిల్ హబ్ ఏర్పాటు చేశామని అందులో ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాను అని తెలియజేశారు.
స్థానిక శాసన సభ్యులు గారు మాట్లాడుతూ జాబ్ మేళాకు హాజరైన యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో 15 కంపెనీలు హాజరవడం జరిగినది ఇందులో దాదాపు 750 ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. కావున హాజరైన యువతీ యువకులు మీకు నచ్చిన కంపెనీలో ఇంటర్వ్యూకి హాజరై ఉద్యోగం పొందాలని గౌరవ ఎమ్మెల్యే గారు తెలియజేశారు.మన సత్యవేడు నియోజకవర్గం లో ప్రతి 90 రోజులకు ఒకసారి సత్యవేడు నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి ఒక మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా ఒక జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది అని గౌరవ ఎమ్మెల్యే గారు తెలియజేశారు.
*ఆర్. లోకనాథం, డిఎస్డివో, Apssdc*,మాట్లాడుతూ.. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగం కల్పించే దిశగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
*ఈ జాబ్ మేళాకి 15 బహుళ జాతీయ కంపెనీలు మెగా జాబ్ మేళాకు హాజరు అవ్వగా 212 మంది హాజరవుగా, 102 మంది వివిధ కంపెనీలకు ఉద్యోగ (Select)అర్హత పొందడం జరిగినది అలాగే 21 మంది ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ అవడం జరిగినది*.
ఈ కార్యక్రమంలో మహమ్మద్ రఫీ గారు, ఎంపీడీవో, పిచ్చాటూరు మండలం, శ్రీ ఇల్లన్ గోవన్ గారు, ఏఎంసీ చైర్మన్, నాగలాపురం, ఆర్. లోకనాథం,జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి, తిరుపతి జిల్లా, స్థానిక ప్రజా ప్రతినిధులు,నాయకులు మరియు ఏపీ ఎస్ ఎస్ డి సి తిరుపతి జిల్లా సిబ్బంది మొదలగువారు పాల్గొనడం జరిగినది.
కృతజ్ఞతలతో
ఆర్ లోకనాథం,
జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, తిరుపతి జిల్లా.
*Encl*: As above photos of Jobmela,Pichatur, submitted regarding.
