
తిరుపతి జిల్లా, నారాయణవనం మండలం కీలగరం పంచాయతీ నందు గల TASA FOODS PVT LTD- 3 వారు ఫౌండేషన్ స్కూల్ కీలగరం మరియు అంగన్వాడీ కేంద్రo నందు ” 3 లక్షల విలువైన అభివృద్ధి పనులు దాతృత్వం లో చేయించడం జరిగింది, వీటితో పాఠశాల రూపురేఖలు మారి పాఠశాల మరింత అందంగా పిల్లలని ఆకర్షించే విధంగా రూపుదిద్దుకోవడం జరిగింది..TASA ప్రతినిధులు కోసం ఏర్పాటు చేసిన అభినందన సభలో TASA MD అర్షద్ హుస్సేన్, ప్లాంట్ మేనేజర్ మురగేష్ మరియు TASA సభ్యులు చే పాఠశాలకు టేబుల్ మరియు చైర్స్ ,గ్రీన్ చాక్ బోర్డ్, నోట్ బుక్ లు, భోజనం ప్లేట్లు ,వాటర్ పైప్,మరియు అంగన్వాడీ కేంద్రం కు బీరువా, టేబుల్, చైర్స్ ,2 ఫాన్స్ భోజనం ప్లేట్లు, గ్లాసు లు వితరణ గా ఇవ్వడం జరిగింది..పాఠశాల ముందు కాంపౌండ్ వాల్ ను నిర్మించడం జరిగింది..ఈ కార్యక్రమంలో మండల MEO జనార్ధన్ రాజు గారు, CDPO సౌభాగ్య గారు,సర్పంచ్ షణ్ముగం గారు, SMC చైర్మన్ చెల్ల దొరై గారు,అంగన్వాడీ సూపర్వైజర్ బేబీ గ్లారు , ప్రధానోపాధ్యాయులు హేమావతి గారు మరియు గ్రామస్థులు పాల్గొనడం జరిగింది…TASA ప్రతినిధులు ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు చేపట్టి పేద పిల్లల అభ్యున్నతి కు దోహదపడతామని తెలియజేయడం జరిగింది..
