*కూరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కు విశేష స్పందన…*

సత్యవేడు నియోజకవర్గంలోని నారా చంద్రబాబు నాయుడు,లోకేష్ బాబు ఆదేశాలతో నియోజకవర్గ టిడిపి ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో కె.వి పురం మండలంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కు విశేష స్పందన లభించింది. ప్రజా సమస్యలపై జరిగిన ప్రజాదర్బార్ లో అనేక సమస్యలపై అర్జీలు సమర్పించారు. సుమారు 350 వరకు వచ్చిన అర్జీలలో ప్రధానంగా హౌసింగ్, రేషన్, పెన్షన్, న్యూ మొదలైన సమస్యలపై స్థానికంగా ప్రజలు అర్జీలు ఇవ్వడం జరిగింది. ప్రజాదర్బార్ లో ప్రజల నుండి అర్జీలు తీసుకొని క్షుణ్ణంగా వారి సమస్యలు విన్న కూరపాటి శంకర్ రెడ్డి సమస్యల పరిష్కారం పై భరోసా ఇచ్చారు.
అంతరం ప్రభుత్వం ప్రతి ఎకరాకు మూడు బస్తాల యూరియాను ఇచ్చే ప్రక్రియలో భాగంగా రైతులకు గుర్తింపు కార్డులను అందజేశారు.
*ప్రజా దర్బార్ లో వచ్చిన అర్జీలపై సమస్యల పరిష్కారం దిశగా చర్యలు…. KSR*
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,లోకేష్ బాబు ఆదేశాలతో ఇకమీదట ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని, ఇందులో భాగంగా ఈరోజు కేవీపీ పురం లో నిర్వహించిన ప్రజాదర్బార్ లో ప్రధానంగా ప్రజలు పెన్షన్లు,రేషన్ కార్డులు, హౌసింగ్, రెవెన్యూ సమస్యలు ఇంకా ఈ మధ్య జరిగిన చెరువు కట్ట తెగిన ఘటన రాయలచెరువు బాధితులు మౌలిక వసతులు విషయంలో పడుతున్న ఇబ్బందులపై తమ దృష్టికి వచ్చాయి అన్నారు. సమస్యలపై వచ్చిన అర్జీలపై
తమ టీం పరిశీలించి స్థానిక నాయకుల ద్వారా అధికారుల దృష్టికి తీసుకుని వెళతామని అవసరమైతే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సత్యవేడు నియోజకవర్గ టిడిపి ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి తెలిపారు.
