*ఏపీలో ముస్లింలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సీఎం*
*ఏపీలో మసీదులకు ప్రతి నెలా రూ.5వేలు:సీఎం చంద్రబాబు*

అమరావతి :
ఆంధ్రరాష్ట్రం లోని ప్రతి మసీదుకు త్వరలోనే నెలకు రూ.5వేలు ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మైనారిటీ ఆడపిల్లలకు ఇంటర్ వరకు ఉచిత విద్య అందిస్తామని అన్నారు.
ఇమామ్, మౌజమ్‌లకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లిస్తామని స్పష్టం చేశారు.
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ చేసినా మైనారిటీల ద్వారానే ఆస్తుల సంరక్షణ చేస్తామని, వక్ఫ్ ఆస్తులను డిజిటలైజ్ చేసి అందరూ పరిశీలించేలా చేస్తామని చెప్పారు
