ఘనంగా జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు

బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ పూర్ చిల్డ్రన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరదయ్యపాలెం మండలం లింగమ నాయుడు పల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 48 విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముజీబ్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ మన దేశానికి చేసిన సేవలను విద్యార్థులకు వివరించే ప్రయత్నం చేశారు ఆయన జన్మదిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2010 నుండి జాతీయ విద్యా దినోత్సవం గా ఈరోజు జరుపుకోవడం పరిపాటిగా మారిందని ఆయన విద్యార్థులకు తెలిపారు. మహానుభావుల జన్మదిన సందర్భంగా పేద విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ నిర్వాహకులు రియాజ్ ను ఆయన అభినందించారు ఈ సంస్థ ద్వారా రాబోవు కాలంలో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో బిఈపిసి ఫౌండేషన్ సభ్యులు రియాజ్, అబ్దుల్లా ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, వసంత విద్యా వాలంటీర్ సుప్రియ తదితరులు పాల్గొన్నారు
