*సత్యవేడు రెవిన్యూ డిజిజన్ ఏర్పాటు చేయండి*
✍️ *శ్రీసిటీ ఉన్న నేపథ్యంలో ఆర్డీఓ, డీఎస్పీ కార్యాలయాలు తప్పనిసరి*
✍️ *సత్యవేడు రెవెన్యూ డివిజన్ కు సిఫార్సు చేస్తూ కలెక్టర్ ద్వారా ప్రతిపాదన*
✍️ *కలెక్టర్ వెంకటేశ్వర్లు కలిసి విన్నవించిన ఎమ్మెల్యే ఆదిమూలం*

సత్యవేడు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ను కోరారు.
శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయానికి ఎమ్మెల్యే ఆదిమూలం చేరుకొని ఈ మేరకు కలెక్టర్ వెంకటేశ్వర్లు కు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే ప్రసిద్ధి చెందిన శ్రీ సిటీ పారిశ్రామిక వాడ తో పాటు, అపోలో, కాప్రికాన్, హీరో వంటి వందల సంఖ్యలో కంపెనీలు సత్యవేడు ప్రాంతంలో ఉందన్నారు.
ఈ నేపథ్యంలో సత్యవేడు నియోజకవర్గం లోని ఏడు మండలాలు కలిపి రెవెన్యూ డివిజన్ ను నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
ఇంతటి ప్రాధాన్యత ఉన్న సత్యవేడలో ఆర్డీవో కార్యాలయం తో పాటు, డీఎస్పీ కార్యాలయం తప్పనిసరిగా ఉండాలని ఆయన వివరించారు.
ఈ విషయాన్ని అసెంబ్లీలో సైతం తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఇందుకు స్పందించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు తన సూచనల మేరకు సత్యవేడు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ను సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి సుముఖంగా ఉన్నట్లు ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు.
*పేదలకు వెంటనే ఇంటి పట్టాలు పంపిణీ చేయాలి*
ఇల్లు లేని నిరుపేదలకు వెంటనే ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జిల్లా కలెక్టర్ ను కోరారు.
తన నియోజకవర్గంలోని ఎస్ ఎస్ బి పేట, వరదయ్యపాలెం లతో పాటు మిగిలిన అన్ని మండలాలలో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.
అలాగే అకస్మాత్తుగా మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ఎమ్మెల్యే ఆదిమూలం కలెక్టరు ను కోరారు.
ఇందుకు స్పందించిన కలెక్టర్ ఒక వారం లోపల ఎస్ ఎస్ బి పేట, వరదయ్యపాలెం లతో పాటు నియోజకవర్గంలోని అన్నీ మండలాలలో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయడానికి అంగీకరించినట్లు ఎమ్మెల్యే ఆదిమూలం వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసి మాజీ చైర్మన్ డి ఇలంగోవన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు పద్దు రాజు, కేవీబి పురం మండలం నేత రమేష్ తదితరులు పాల్గొన్నారు.
