*బాపట్ల రైల్వే స్టేషన్‌లో 21 కేజీల గంజాయి పట్టివేత*

బాపట్ల రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేసిన ఈగల్, ఆర్పీఎఫ్ సిబ్బంది
ఒడిశాకు చెందిన ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రైన్‌లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు బాపట్ల రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నారు. పూరి – తిరుపతి రైలులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు, బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద ఈగల్, ఆర్‌పీఎఫ్ టీమ్‌లు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 21 కేజీల గంజాయి పట్టుబడింది.
ప్రాథమిక విచారణలో ప్రకాశ్ అనే వ్యక్తి ఒడిశాలోని బరంపూర్ నుంచి కేరళకు ఈ గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.
రైల్వే స్టేషన్లలో క్రమం తప్పకుండా తనిఖీలు కొనసాగిస్తామని, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఈగల్ టీమ్ అధికారులు హెచ్చరించారు.
