*వరదయ్యపాలెం మండల ప్రజలకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు* 💐🤝🙏
*దీపావళి పండుగ పురస్కరించుకొని బాణసంచా తయారీ కేంద్రాలు మరియు షాపులు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.*
💥 *ప్రజల భద్రత శ్రేయస్సులో భాగంగా పోలీస్ వారికి సహకరించండి,ఎస్ఐ🦯🚓మల్లికార్జున నాయుడు*
💫 *ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా టపాసులు తయారుచేసిన, నిల్వ ఉంచిన, విక్రయించిన వారిపై చట్ట ప్రకారం ప్రకారం చర్యలు తప్పవు*
దీపావళి పండుగను పురస్కరించుకొని కొంతమంది అక్రమార్కులు లాభాలను ఆశించి సుదూర ప్రాంతాల నుండి బాణసంచాను, వాటి తయారీ మూడి పదార్థాలను కొనుగోలు చేసి నివాస ప్రాంతాలలో నిల్వ చేయడం, కొంతమంది నివాస గృహాలనే బాణసంచా తయారీ కేంద్రాలుగా నిర్వహిస్తున్నారు. బాణసంచాను అనుమతి లేకుండా నిల్వ ఉంచిన, తయారుచేసిన, విక్రయాలు జరిపిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని *వరదయ్యపాలెం* *ఎస్సై మల్లికార్జున* నాయుడు, తెలుపుతూ బాణసంచా విక్రేతలకు నియమ నిబంధనలు గురించి తెలియజేయడం జరిగింది..
కొంతమంది ఎటువంటి ప్రభుత్వ, పోలీసు వారి అనుమతి లేకుండా అనధికారికంగా ముడి సరుకులు తీసుకువచ్చి చాటుమాటున అమ్ముకొని లాభార్జన చేసుకుంటున్నారు. ఇలా అక్రమంగా మందు గుండు సామాగ్రి నిల్వ ఉంచిన, రవాణా చేసిన, తయారుచేసిన, వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి ప్రత్యేక దాడులు నిర్వహించి వారిని అదుపులోనికి తీసుకోవడం జరుగుతుంది.
బాణసంచాను తయారి, నిల్వలు, విక్రయాలు నిర్వహించేందుకు పోలీసువారి అనుమతి తప్పనిసరి నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు.
ప్రభుత్వ అనుమతులు ఉన్నప్పటికీ ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా జనావాసాల మధ్యలో గోడాన్స్ ఏర్పాటు చేసి ప్రజా భద్రతను, ఆరోగ్యాన్ని దెబ్బతీసి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు.
బాణసంచా విక్రయ లైసెన్స్ కల్గిన దుకాణదారులు మాత్రమే అమ్మాలి. మిగిలిన ఎవరు విక్రయించినా చట్ట వ్యతిరేఖమే.
బాణసంచా విక్రయ/తయారీ లైసెన్స్ కల్గిన దుకాణదారులు ప్రమాదాలు నివారణ కొరకు పాటించాల్సిన నియమ నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించాలి..
జిల్లాలో శాశ్వత & తాత్కాలిక బాణసంచా తయారీ లేదా విక్రయాల లైసెన్సు కల్గిన దుకాణాల్లో మాత్రమే బాణసంచా అమ్మాలి. తాత్కాలిక లైసెన్సుదారులు బహిరంగ ప్రదేశాల్లో నిర్ణీత కొలతల మేరకు ప్రత్యేక షెడ్డులలో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి.
అగ్నిపమాదాలను నిలువరించేందుకు వీలుగా నియమ నిబంధనలు పక్కాగా పాటించాలి. నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల్లో సిద్ధంగా ఉంచుకోవాలి.
18 సంవత్సరాలలోపు పిల్లలను బాణసంచా విక్రయ మరియు తయారీ పనుల్లో ఉంచుకోరాదు.
లైసెన్స్ కలిగి ఉన్న విక్రయిదారులు లైసెన్స్ లేని వారికి విక్రయించిన తద్వారా ఏదైనా ప్రమాదం సంభవించిన దానికి లైసెన్స్ దారులదే పూర్తి బాధ్యత..
జనావాసాలకు, విద్యాసంస్థలకు, హాస్పటల్స్ కు దూరంగా బాణసంచా తయారి, విక్రయాలు నిర్వహించాలి.
దీపావళిని పురస్కరించుకొని బాణ సంచాను అనుమతి లేకుండా నిల్వ ఉంచిన విక్రయాలు జరిపిన తయారుచేసిన వాటిని వినియోగించిన అటువంటి వారిపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడమే కాక ప్రేలుడు చట్టం, ప్రేలుడు పదార్థాల చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
*గతంలో* *సొంతవేలూరు* *దగ్గర కోవాకూలి* గ్రామంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని, ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా సిబ్బందిని అప్రమత్తం చేసి తనిఖీలు నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి, పోలీసు వారి నియమ నిబంధనలను ఏమాత్రం మీరిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
పోలీసు అధికారులు బాణాసంచా వ్యాపారులకు తమ సిబ్బందికి భీమా (ఇన్సూరెన్స్) చేయించుకోవాలని, అగ్నిప్రమాదాల సందర్భంలో తక్షణ సహాయానికి ఫైర్ డిపార్ట్‌మెంట్ మరియు పోలీసులను సమాచారమివ్వాలని సూచించారు.
ప్రజలకు బాణసంచా అక్రమ నిల్వ, విక్రయ నిబంధనలు పాటించకపోవడం వంటి వాటికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీసు వారికి తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

