నారా గిరీష్ ను సన్మానించిన శ్రీ తాతయ్య గుంట గంగమ్మ గుడి చైర్మన్..

తిరుపతి అక్టోబర్ 3 :
స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా గిరీష్ ను శుక్రవారం శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను శాలువాతో సత్కరించారు. అంతకుమునుపు స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు సతీమణి ఇందిరమ్మను కూడా మహేష్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శాప్ చైర్మన్ రవి నాయుడు కూడా పాల్గొన్నారు. ఈనెల 7వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారావారిపల్లె కి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రవి నాయుడుతో పాటు తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ వెళ్లారు.
