*అంబేడ్కర్ విగ్రహాన్ని కాల్చిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి*
✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం డిమాండ్*

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని కాల్చిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం డిమాండ్ చేశారు.
జీడీ నెల్లూరు నియోజకవర్గం, వెదరుకుప్పం మండలం, దేవళం పేటలో గుర్తు తెలియని వ్యక్తులు అంబేడ్కర్ విగ్రహాంను కాల్చడం అమానుషమైన చర్యగా ఆయన పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్, ఎస్.పీ, ఉన్నతాధికారులు వెంటనే అంబేడ్కర్ విగ్రహాన్ని పునః ప్రతిష్టించాలని, అలాగే దీనికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యేలు థామస్, కే.మురళి మోహన్, తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు సి.ఆర్.రాజన్ తదితరులు పాల్గొన్నారు.
