శ్రీసిటీ పరిశ్రమలలో ఆయుధ పూజ వేడుకలు

శ్రీసిటీలోని పలు పరిశ్రమలు మంగళవారం ఆయుధ పూజ వేడుకలను ఎంతో ఉత్సాహంతో, సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నాయి. కంపెనీల ఉత్పత్తికి వినియోగించే పనిముట్లు, యంత్రాలు, వాహనాలను అలంకరించి పూజలు నిర్వహించారు. పరిశ్రమలను పువ్వులు, ముగ్గులతో కొత్త కాంతులీనేలా తీర్చిదిద్దారు. కార్మికులు భద్రత, శ్రేయస్సు ను కాంక్షిస్తూ భక్తిశ్రద్దలతో ఆయుధపూజను నిర్వహించారు. ఆధ్యాత్మికత, సంస్కృతీ సంప్రదాయాలు, ఐక్యతను ప్రతిబింబించేలా శ్రీసిటీ పారిశ్రామికవాడలో ఈ వేడుకలు చోటుచేసుకున్నాయి. కాగా మరికొన్ని పరిశ్రమలు బుధవారం ఆయుధపూజ నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.
