*యథేచ్చగా ఇసుక అక్రమ రవాణ*
*మూడు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు*
నాగలాపురం: ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకాసురులు ఇసుకను తరలిస్తున్నారు.
నిర్దేశిత సమయంలో ఇసుకను రవాణా చేసుకోవాలని ఉన్నత అధికారులు పదేపదే చెబుతున్నా. కొంత మంది ఇసుకాసురులు రెచ్చి పోతున్నారు.
ఈ మేరకు మండలంలోని చిన్నాపట్టు వద్ద అరణియార్ నదిలో బుధవారం ఉదయం 4 గంటలకు ఇసుక అక్రమ రవాణా కు పాల్పడుతున్నట్లు స్థానికులు డేల్ 100 సమాచారం ఇవ్వడంతో రెండు ఇసుక ట్రాక్టర్లు పోలీసులు స్వాదీనం చేసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు.
ఇకనైన పోలీసులు ఉన్నత అధికారులు స్పందించి రాత్రి వేళలో గట్టి గస్తీ నిర్వహించి ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
