Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఒక్కసారి మాత్రమే వినియోగించండి

*🔳ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఒక్కసారి మాత్రమే వినియోగించండి*

 

*🔳 అతిగా వాడితే అనర్థాలు!*

 

*🔳తిరుపతి, నెల్లూరు జిల్లాలో పెరుగుతున్న వినియోగం* –

 

*🔳 తిరుపతి జిల్లా లో 22,18,000 మంది జనాభా*

 

*🔳నెల్లూరు జిల్లా జనాభా 29.64 లక్షలుపైగా*

 

*🔳ప్రస్తుతంరెండు జిల్లా ల జనాభా 52 లక్షల నుండి 55 వరకు ఉంటుందని అంచనా!*

 

*🔳దుకాణాల్లో కొనుక్కున్న తాగునీటి సీసాలను ఒక్కసారి మాత్రమే వినియోగించాలి*

*: ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించకపోతే, దీర్ఘకాలంలో అనారోగ్యాల బారిన పడతామని పదే పదే నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ మనం తాగేనీటికి ఉపయోగించే ప్లాస్టిక్ బాటిళ్లలోని హానికరమైన రసాయనాల వల్ల ముప్పు తెచ్చిపెట్టుకుంటున్నాం. నిరంతరం మనల్ని మనం ప్రమాదంలో పడేసుకుంటున్నాము. దుకాణాల్లో కొనుక్కున్న తాగునీటి సీసాలను ఒక్కసారి మాత్రమే వినియోగించాలి. ఈ విషయం తెలియక చాలా మంది నెలల తరబడి వీటిల్లోనే నీరు పట్టుకొని తాగుతున్నారు. వీరిలో విద్యార్థులు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.*

 

*అతిగా వాడితే అనర్థాలివిగో: విషపూరిత రసాయనాలతో తయారు చేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లను అధికంగా వినియోగం వల్ల మహిళలు, పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు తలెత్తుతాయి. ఆడ పిల్లలు గర్భ సంబంధిత సమస్యల బారిన పడతారు. ప్లాస్టిక్‌ బాటిళ్లను ఎండలో పెట్టడం వల్ల వేడెక్కి, వాటి తయారీలో ఉపయోగించిన రసాయనాలు నీటిలో కలుస్తున్నాయి. ఇవి కంటికి కనిపించకపోవడంతో అలాగే తాగేసి చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. సీసాలను తరచూ శుభ్రం చేయకపోవడం వల్ల దుమ్ము, ధూళి ఇతర హానికరమైన సూక్ష్మజీవులు అందులోకి చేరడంతో వాంతులు, విరేచనాలకు కారణమవుతాయి.*

 

*ఒక్క రోజులోనే: 2011 లెక్కల ప్రకారం తిరుపతి జిల్లా జనాభా*

*22,18,000, నెల్లూరు జిల్లా* *జనాభా 29.64 లక్షలుపైగా*

*ఉన్నారు. రెండు జిలాల్లో ప్రస్తుతం 52నుండి 55 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీరిలో కనీసం 20 లక్షల మంది రోజుకు కనీసం ఒకసారైనా ప్లాస్టిక్‌ సీసాల్లో నీరు తాగుతున్నారు. దాదాపు 20 నుంచి 30 వేల నీటి, కూల్డ్రింక్స్తో కూడిన ప్లాస్టిక్‌ బాటిళ్లు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సినిమా థియేటర్లు, హోటళ్లు, సూపర్‌ మార్కెట్లు, దుకాణాల్లో విక్రయిస్తున్నారు. వీటిలో సగానికిపైగా ఒకసారికి మించి వినియోగిస్తున్నారు.*

 

*పెళ్లిళ్లు, పూజలు, వ్రతాలు, పుట్టినరోజు వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో కనీసం 30వేల ప్లాస్టిక్‌ బాటిళ్లను ఉపయోగిస్తున్నారు. రెండు జిల్లాలోని 1000 కు పై చెత్త సేకరణ కేంద్రాల ద్వారా రోజుకు సుమారు 10వేల ప్లాస్టిక్‌ బాటిళ్లను చెత్త నుంచి వేరు చేస్తున్నారు. తిరుపతి’నెల్లూరు నగరపాలిక, గూడూరు, శ్రీ కాళహస్తి, సూళ్లూరుపేట, నాయుడుపేట,, కావలి, ఆత్మకూరు ద్వారా రోజుకు దాదాపు 900 టన్నుల వ్యర్థాలు వస్తుంటే, వాటర్ బాటిళ్లు 20 నుంచి 30 టన్నుల మేర ఉంటున్నాయి.*

 

*మట్టి, స్టీల్‌వి వాడితే మేలు:*

 

*’ప్లాస్టిక్‌ వాటర్ బాటిళ్లను ఒకసారి కంటే ఎక్కువసార్లు వాడితే అనర్థాలు వస్తాయి. ఇది పలు రకాల క్యాన్సర్లకు కారణం కావచ్చు. పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కాచి చల్లార్చిన నీటిని మట్టి, స్టీల్‌ సీసాల్లో పట్టుకొని తాగడం మంచిది.’ – బాలకృష్ణ నాయక్, తిరుపతి జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి*

 

*సచివాలయంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం – నేటి నుంచి అమలు*

 

*రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలన్న సంకల్పానికి కూటమి ప్రభుత్వం అడుగు వేస్తోంది. ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌ను రాష్ట్ర సచివాలయంలో నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేసిన సంగతి తెలిసిందే. ప్లాస్టిక్ స్థానంలో పర్యావరణానికి హాని కలిగించని ప్రత్యామ్నాయ వస్తువులు వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. దశల వారీగా ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ వచ్చే సంవత్సరం జూన్ 5 నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.*

Related posts

దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారాయణ

Garuda Telugu News

చిత్తూరు జిల్లా మురకంబట్టు ప్రాంతంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార

Garuda Telugu News

తిరుమలలో వైభవంగా రథసప్తమి

Garuda Telugu News

Leave a Comment